ఆకలితో తనని తానే తినేయబోయిన పాము.. వీడియో వైరల్

0
0


పాముకు బాగా ఆకలి వేసింది. పరిసరాల్లో కీటకాలు, ఇతరాత్ర ఆహారం ఏదీ కనిపించకపోవడంతో.. దాని వయ్యారంగా కదులుతున్న తన తోక కనిపించింది. ఏదైతేనేం.. దీన్ని మింగేస్తే ఆకలి తీరిపోతుందని భావించింది. వెంటనే తన తోక అందుకుని మింగడం మొదలుపెట్టింది. అలా సుమారు సంగానికి పైగా శరీరాన్ని మింగేసింది.

రోథక్కర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లోని Forgotten Friend Reptile Sanctuary అనే పేజ్‌లో ఈ వీడియోను పోస్టు చేశాడు. దీంతో వీడియో వైరల్‌గా మారింది. జంతు ప్రేమికుడైన రోథక్కర్ గత 15 ఏళ్లుగా పాముల అభయారణ్యంలో ఉంటున్నాడు. ఈ సందర్భంగా కొన్ని అరుదైన పాములను ప్రత్యేకంగా పెంచుతున్నాడు. అయితే, ఇటీవల అతడు ఓ అరుదైన దృశ్యం చూశాడు.

కింగ్ స్నేక్ అనే పాము పిల్ల ఆకలితో తనని తానే తినడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే దాన్ని వీడియో తీశాడు. ‘‘గత పదిహేనేళ్లలో పాములు తనని తానే తినడానికి ప్రయత్నించం ఎప్పుడూ చూడలేదు. ఇది ఆకలితో దాదాపు సగం శరీరాన్ని మింగేసింది. ఆకలి, దప్పిక లేదా ఒత్తిడి వల్ల అది తనని తాను తినడానికి ప్రయత్నించి ఉండవచ్చు’’ అని తెలిపాడు. అనంతరం ఆ పాము శరీరాన్ని దాని నోటి నుంచి బయటకు లాగి రక్షించాడు.
వీడియో:Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here