ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్‌లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..

0
0


ఆగస్టు15న అమిత్ షా కశ్మీర్‌లో పర్యటన..? ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయడమే లక్ష్యం..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగస్టు 15న జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పార్లమెంట్‌లో కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టి విజయవంతంగా పాస్ చేయించిన అమిత్ షా, అనంతరం జరిగిన పరిణామాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి కశ్మీర్‌లో పర్యటించనున్న ఆయన, కశ్మీర్‌లో నిర్వహించే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గోనున్నట్టు సమాచారం.

70 సంవత్సరాల తర్వాత అమలు కానున్న ఒకే దేశం,ఒకే జెండా

కశ్మీర్‌లో మొన్నటి వరకు రెండు జెండాల సంస్కృతి,కశ్మీర్ పునర్విభజనతో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో మొదటిసారి కశ్మీర్‌లో రెండు జెండాల సంస్కృతికి ఫుల్‌‌స్టాప్ పడనుంది. దీంతో రానున్న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా మాత్రమే ఎగరనుంది. బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కోన్న విధంగా ఆ రాష్ట్రంలో ప్రత్యేక హక్కులను కల్పించే ఆర్టికల్‌ను తొలగించిన కేంద్రం,అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో గత వారం రోజులుగా ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.

ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయడమే లక్ష్యం

ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగరవేయడమే లక్ష్యం

కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో కేవలం రాష్ట్ర స్థాయితో పాటు, జిల్లా కేంద్రాల్లో మాత్రమే జాతీయ జెండాలు ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగానే పార్టీ నేతలు, కార్యకర్తలలతో ప్రజలు స్వచ్ఛంధంగా ప్రతి గ్రామాన జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పార్టీ నేతలకు అమిత్ షా పిలుపునిచ్చారు. అప్పుడే కశ్మీర్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చిన సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పార్టీ నేతలు అందుకు అనుగుణంగా పావులు కదిపారు. దీంతో నేరుగా కేంద్ర హోంమంత్రి స్థాయిలో పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షా స్యయంగా కశ్మీర్‌లో పర్యటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆయన పర్యటనపై ఎలాంటీ అధికారిక సమాచారం ప్రకటించనప్పటికి, పరిస్థితులు అనుకూలిస్తే అమిత్ షా వెళ్లేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది.

ఆసాధరణ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన,కశ్మీర్ పరిణామాలపై ఫోకస్

ఆసాధరణ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన,కశ్మీర్ పరిణామాలపై ఫోకస్

సాధరణంగా గతంలో ఉన్న పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రులు కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించినప్పుటు పలు వేర్పాటు వాద సంస్థలు కశ్మీర్ బంద్‌కు పిలుపునిస్తారు. కాని ప్రస్థుతం అమిత్ షా హోంమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటీ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పడింది. దీనికి తోడు కశ్మీర్ మొత్తం భద్రతా దళాల కనుసన్నల్లో కొనసాగుతుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందనే అంచనా వేస్తున్నారు. అయితే కశ్మీర్‌లో సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విద్యాలయాలు కూడ రీఓపెన్ కావడంతో పాటు సాధరణ జనజీవనం కోసం కర్ఫ్యూ నిబంధనలు, 144 సెక్షన్ల సడలింపు చేశారు. దీంతో ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా బక్రిద్ పండగా ముగియడంతో అమిత్ షా పర్యటించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here