‘ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసిన వాళ్లకు ఖతార్‌ మ్యాచ్‌తో నిరూపించాం’

0
2


దోహా: భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసిన వాళ్లకు ఖతార్‌ మ్యాచ్‌తో సమాధానం ఇచ్చాం అని భారత కోచ్ ఇగోర్ స్టిమాక్ అన్నాడు. భారత ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే మెరుగ్గా ఉన్న ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ అద్వితీయ ప్రదర్శన చేసాడు. ఈ డ్రాతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ర్యాంకింగ్స్‌లో భారత్ 103వ స్థానంలో ఉండగా.. ఖతార్‌ 62వ స్థానంలో ఉంది.

మరో 159 పరుగులు.. వివ్‌ రిచర్డ్స్‌ 43 ఏళ్ల రికార్డుకు స్మిత్ ఎసరు!!

ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓమన్ చేతిలో ఓటమి పాలైన భారత్.. ఆసియా చాంపియన్, ప్రపంచ 62వ ర్యాంకర్ ఖతార్‌పై మాత్రం సత్తా చాటింది. మ్యాచ్‌కు ముందు ఖతార్‌తో భారత్ డీ కొడుతుందంటే.. ఎంత తేడాతో ఓడుతుందనుకున్నారు. కానీ.. భారత్ అంచనాలను తలక్రిందులు చేసి ఖతార్‌ను ఒక్క గోల్ కూడా కొట్టనీయలేదు. అనారోగ్యం కారణంగా స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునిల్ ఛెత్రీ దూరమైన ఈ మ్యాచ్‌లో.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం కోచ్ ఇగోర్ స్టిమాక్ మాట్లాడుతూ… ‘ఖతార్‌పై మా ప్రదర్శన అభిమానులు తర్వాతి మ్యాచ్‌కు వచ్చేలా చేసింది. కోల్‌కతాలో ఫుట్‌బాల్‌పై ఉన్న ఆసక్తి గురించి చాలా విన్నా. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వైబీకే స్టేడియం మొత్తంను అభిమానులతో చూడాలనుకుంటున్నా. మీరు 12వ ఆటగాడిగా ఉండాలి. మూడు పాయింట్లు సాధించడానికి మీ మద్దతు అవసరం’ అని అన్నారు.

‘భారత ఫుట్‌బాల్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసిన వాళ్లకు ఖతార్‌ మ్యాచ్‌తో నిరూపించుకున్నాం. ఆసియాలోని అన్ని జట్టుతో పోలిస్తే ఖతార్ బలమైన జట్టు. అలాంటి జట్టుపై మా ఆటగాళ్లు చివరి నిమిషం వరకు పోరాట పటిమ కనబరిచారు. ఆటగాళ్లు అందరూ ఏకాగ్రతతో ఆడారు. ఈ ప్రదర్శన ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని రుజువు చేస్తుంది. ఆసియా ఛాంపియన్‌లకు వ్యతిరేకంగా ఒక పాయింట్ సాధించినందుకు కోచ్‌గా నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ఆటగాళ్ల పట్ల గర్వపడుతున్నాను. ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను నిజంగా ఆనందించడంతో ఖతార్‌ను కూడా అభినందించాలి’ అని స్టిమాక్ పేర్కొన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here