ఆటల్లో ఆదర్శం

0
5


ఆటల్లో ఆదర్శం

రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న విద్యార్థులు

గ్రామీణ విద్యార్థులు.. ఒకవైపు చదువులో చక్కగా ప్రతిభ  చూపుతున్నారు. మరోవైపు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొంటూ సత్తాచాటుతున్నారు సిరికొండ ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో పీడీ ముత్తెన్న (దాచిన చిత్రం)

అందరి సహకారంతో

విద్యార్థులు క్రీడల్లో రాణించడం చాలా ఆనందంగా ఉంది. ప్రిన్సిపల్‌ సునీతతోపాటు ఉపాధ్యాయులు పూర్తి సహకారం అందిస్తుండటంతో వారు నిత్యం సాధన చేయగలుగుతున్నారు.

– ముత్తెన్న, పీడీ

న్యూస్‌టుడే, సిరికొండ

 

 

ఆదర్శ పాఠశాలలో ప్రస్తుతం 496 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పీడీ ముత్తెన్న క్రీడాకారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆటల్లో మెలకువలు నేర్పిస్తుండటంతో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చుతున్నారు.

ప్రాతినిధ్యం.. పతకం

* కబడ్డీ రాష్ట్రస్థాయి పోటీల్లో సరిత, అఖిల కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. అరుణ, తరుణ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడారు. * వాలీబాల్‌ అండర్‌-17 రాష్ట్ర స్థాయి పోటీల్లో నరేశ్‌ కాంస్య పతకం అందుకొని పుణెలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ●* హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి షార్ట్‌పుట్‌ పోటీల్లో ఎన్‌.లౌక్య బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. * ● బి.నిర్మల రాష్ట్ర స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది.●* బిజ సంపత్‌ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నాడు.

వాలీబాల్‌ అంటే ప్రాణం

– నరేశ్‌, కొండాపూర్‌

నాకు చిన్నప్పటి నుంచి వాలీబాల్‌ అంటే ప్రాణం. మా గ్రామంలో అందరూ ఆడుతుండటంతో నాకు ఆటపై ఆసక్తి పెరిగింది. పీడీ సార్‌ చెప్పిన మెలకువలు పోటీల్లో బాగా ఉపయోగపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఉంది.

దేశం తరఫున ఆడాలని..

– బి.నిర్మల, ఆదర్శ పాఠశాల

అమ్మానాన్న, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నా. సొసైటీ ఆటలపోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా. జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటి అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ఆడాలని ఉంది.

గుర్తింపు సాధిస్తా

– ఎన్‌.లౌక్య, షార్ట్‌ఫుట్‌ క్రీడాకారిణి, పోత్నూర్‌

రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించడం ఆనందంగా ఉంది. నిత్యం సాధన చేస్తూ చక్కగా రాణించి గుర్తింపు సాధిస్తా. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి సాధన చేస్తున్నా.

గర్వంగా ఉంది

– సునీత, ప్రిన్సిపల్‌

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో ముందుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తూ పాఠశాలకు పేరు తేవడం గర్వంగా ఉంది. పీడీ ముత్తెన్న అంకిత భావానికి విద్యార్థుల కఠోర శ్రమ తోడు కావడంతో క్రీడాపోటీల్లో ప్రతిభ చాటుతున్నారు.

జాతీయ స్థాయిలో ఆడతా..

– ఎం.అరుణ, కబడ్డీ క్రీడాకారిణి

మొదటి నుంచి కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. పీడీ సూచనలు పాటిస్తూ నిత్యం సాధన చేస్తున్నా. జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్నదే నా లక్ష్యం.

ఖోఖో..కబడ్ఢీ.

– తరుణ్‌, కొండూర్‌

ఖోఖో, కబడ్డీల్లో నిత్యం సాధన చేస్తున్నా. కబడ్డీలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. పాఠశాలలో సాధన చేసేటప్పుడు పోటాపోటీగా తలపడతాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here