ఆటో ఇండస్ట్రీలో ఉద్యోగాల ఊస్టింగ్… మళ్లీ 2008 సీన్ రిపీటవుతోందా ?

0
1


ఆటో ఇండస్ట్రీలో ఉద్యోగాల ఊస్టింగ్… మళ్లీ 2008 సీన్ రిపీటవుతోందా ?

ఆటో ఇండస్ట్రీ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత అనిశ్చితికి గురవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా దేశ ప్యాసింజర్ కార్ మార్కెట్లో తిరుగులేని లీడర్‌గా ఉన్న మారుతి సుజుకి గత ఐదు నెలలుగా కార్ల అమ్మకాల్లో తిరోగమన వృద్ధిని నమోదు చేయడంతో పాటు ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. ఇదే కాదు వివిధ కార్ కంపెనీలు కూడా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే.. ?

దేశ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఆటో ఇండస్ట్రీ వాటా యాభై శాతానికి పైగానే ఉంది. గత పదేళ్లలో ఎప్పుడో ఎదుర్కోనంత అనిశ్చితిని ఎదుర్కొంటోంది ఈ రంగం. ఇదే కాదు.. మళ్లీ ఎప్పుడు కోలుకుంటుందో కూడా స్పష్టత లేనంతగా తయారైంది మార్కెట్.

మారుతి పరిస్థితి ఏంటంటే..

కంపెనీల లెక్కల ప్రకారం ఆరు నెలల సగటున తాత్కాలికంగా 18845 మంది సేవలను గత ఆరు నెలల్లో(జూన్ ఆఖరు నాటికి) వినియోగించుకుంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 1181 మంది తక్కువ. అంటే 6 శాతం ఉద్యోగాలు ఊడిపోతాయి. ఏప్రిల్ నుంచి తీసివేతల సంఖ్య పెరిగిపోయింది.

ఈ విషయాలను మొట్టమొదటిసారిగా మారుతి సుజుకి సంస్థ ధృవీకరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలకు రిపోర్ట్ చేసింది. తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటివరకూ ఎప్పుడూ మారుతి ఇలా బహిర్గతం చేయలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా టెన్షన్ పెంచుతోంది.

అయితే శాశ్వత ఉద్యోగుల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పులూ లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంస్థ దగ్గర 15892 మంది విధుల్లో ఉన్నారు. వీళ్లలో ఎలాంటి కోతలు ఉండొచ్చు అనే అంశంపై మాత్రం మారుతి క్లారిటీ ఇవ్వలేదు. గత ఆరు నెలల్లో మారుతి సంస్థ తమ ఉత్పత్తిలో 10.3 శాతం వాటాలను తగ్గించింది.

డీలర్ల దగ్గర కూడా

డీలర్ల దగ్గర కూడా

మారుతితో పాటు ఇతర కంపెనీల డీలర్ల దగ్గర కూడా ఉద్యోగులను మెల్లిగా తగ్గించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కార్ల అమ్మకాలు ఇలా మరికొద్ది కాలం పాటు ఇలానే డౌన్ ట్రెండ్ లో ఉంటే మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.

దేనికి సంకేతం

దేనికి సంకేతం

ఆటో పరిశ్రమ.. అభివృద్ధికి దిక్సూచి లాంటిది. ఈ రంగం పెరుగుతోంది అంటే… దానర్థం ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటోంది అనేది ఓ బ్యారోమీటర్. ఎందుకంటే వివిధ రంగాల్లో గ్రోత్ బాగుంటేనే దాని కారణం వల్ల కొనుగోలుదార్ల వినియోగశక్తి పెరుగుతోంది. అది పరోక్షంగా ఆటో పరిశ్రమపై ప్రభావాన్ని చూపిస్తుంది. టూ వీలర్స్, ఫోర్ వీలర్ సేల్స్ బాగుంటాయి. ఇప్పుడు స్థితి కాస్త అగమ్యగోచరంగానే ఉంది. అమెరికా – చైనా మధ్య వాణిజ్య అనిశ్చితి ఓ సమస్య. దేశంలో ఎన్.బి.ఎఫ్.సిల దెబ్బ లిక్విడిటీ హరించుకుపోయింది, బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు బెంబేలెత్తుతున్నాయి. ఎఫ్ఎంసిజిల కంపెనీల అమ్మకాల్లో పెద్ద వృద్ధి లేదు, ట్రాక్టర్ సేల్స్ కూడా క్షీణించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు.. ఒకదానికి ఒకటి లంకెలా ఇరుక్కుని ఉన్నాయి. అన్నింటినీ ఒక చోటికి క్రోడీకరించి చూస్తే ఆర్థిక వ్యవస్థ మెల్లిగా మందగిస్తోందని అర్థమవుతోంది. ఆటోపరిశ్రమతో మొదలైన జాబ్ కట్స్.. తర్వాత ఏ రంగాలకు ఏ స్థాయిలో ఉంటాయనేదే అంతుచిక్కడం లేదు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here