ఆటో, బస్సు ఢీ

0
2


ఆటో, బస్సు ఢీ

ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌ గ్రామీణం: నిజామాబాద్‌ మండలం మల్లారం అటవీ ప్రాంతంలో బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలానికి చెందిన కొందరు సోమవారం మాక్లూర్‌ మండలం దాస్‌నగర్‌ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తమ పిల్లలను చేర్చడానికి ఆటోలో వచ్చారు. పిల్లలను బడిలో చేర్చిన అనంతరం పిట్లంకు చెందిన ఆటోలోనే తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఆటో నిజామాబాద్‌ మండలం మల్లారం అటవీ ప్రాంతానికి చేరుకునే సమయంలో ఎదురుగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో పిట్లం మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ రమేష్(40) అక్కడికక్కడే మృతి చెందారు. పిట్లం మండలం గోద్మెగావ్‌ గ్రామానికి చెందిన రాములు, అపర్ణ, లాలయ్య, పిట్లం మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌, చంద్రకళ, దీక్షిత్‌ అనే ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఠాణా ఎస్‌ఎహెవో ప్రభాకర్‌ తమ సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here