ఆదర్శం కామారెడ్డి ఆర్యవైశ్య యువజన సంఘం

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మాగాంధీ 150 వ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో వీటి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో 20 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు యాద నాగేశ్వర్‌ గుప్తా మాట్లాడారు. కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్రంలోని ఆర్యవైశ్య యువజన సంఘాలందరికీ మార్గదర్శకంగా ఉంటుందన్నారు. 20 మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని, అన్ని యువజన సంఘాల సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువజన సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ముప్పారపు ఆనంద్‌, మండల అధ్యక్షులు కొక్కొండ రవీందర్‌ గుప్త, జిల్లా కోశాధికారి గోవిందు భాస్కర్‌ గుప్త, జిల్లా పిఆర్‌ఓ విశ్వనాధుల మహేష్‌ గుప్తా, బాశెట్టి నాగేశ్వర్‌, యువజన సంఘం పట్టణ అధ్యక్షులు వలిపిశెట్టి భాస్కర్‌ గుప్త, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ కోశాధికారి సంతోష్‌ గుప్తా, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ రాజేష్‌, అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రెటరీ నవీన్‌, ఉపాధ్యక్షులు ఆకుల శివకష్ణ, సాయిరాం, పిఆర్‌ఓ గంప ప్రసాద్‌, సమన్వయకర్త బాలు తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here