ఆదాయ పాలసీ

0
1


ఆదాయ పాలసీ

9 నుంచి దరఖాస్తులు

18న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల ఎంపిక

న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌

మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్జీల స్వీకరణ, లైసెన్సుల జారీ షెడ్యూల్‌నూ ఖరారు చేశారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18న లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించనున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం 95 మద్యం షాపులున్నాయి. ఈసారి కేవలం 91 దుకాణాలకే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలగించిననాలుగులో మూడింటిని ఆదిలాబాద్‌, ఒక దుకాణాన్ని కామారెడ్డికి బదిలీ చేశారు. ఇందులో ఆర్మూర్‌ సర్కిల్‌ పరిధిలోని ఆర్మూర్‌ పట్టణంలో 2, మామిడిపల్లి, ధర్మారం(బి)లో ఒక్కోటి ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 38 దుకాణాలున్నాయి. ఈసారి కొత్తగా రామారెడ్డి, పెద్దగొడప్‌గల్‌ మండలాలకే కేటాయించారు.

రూ.2 లక్షలకు పెంపుతో..

2017 పాలసీలో దరఖాస్తు ఫీజు(నాన్‌ రిఫండబుల్‌)ని రూ.లక్షకు పరిమితం చేశారు. ఈసారి రూ.2 లక్షలు చేశారు. కొంత మేర దరఖాస్తులు తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పైగా శ్లాబ్‌ ధరలనూ పెంచడంతో దరఖాస్తులపై ప్రభావం ఉంటుందని సమాచారం. దరఖాస్తులు తగ్గినా ఫీజు రూపంలో వచ్చే ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

* ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలకు ఎక్సైజ్‌ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించవచ్ఛు

* 18న నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో, లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి లక్కీ డ్రా తీసి దుకాణాలను ఇవ్వనున్నారు.

* దరఖాస్తు విధానాన్ని ఈసారి మరింత సులభతరం చేసినట్లు నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీన్‌ చంద్ర తెలిపారు. కేవలం ఒకే ఒక్క దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేస్తే సరిపోతుంది. రూ.2లక్షలను డీడీ ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డులు సమర్పించాల్సి ఉంటుంది. ఈసారి ఎలాంటి ఐఎండీ డిపాజిట్‌ అవసరం లేదని ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

 Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here