ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నింటికీ ఒకటే కార్డ్!

0
2


ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్.. అన్నింటికీ ఒకటే కార్డ్!

దేశంలోని ప్రతి పౌరుడికి పాస్‌పోర్ట్, ఆధార్, ఓటరు కార్డు, బ్యాంకు ఖాతాలకు.. ప్రత్యామ్నాయంగా ఓ బహుళ ప్రయోజన సాధక ఐడీ కార్డు ఒకటి ఉండాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇలాంటి కార్డును జారీ చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెరపైకి తెచ్చారు. సమాచారాన్ని అంతటిీని డిజిటల్ రూపంలోకి తీసుకు వచ్చేందుకు 2021లో దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణకు మొబైల్ యాప్ వాడనున్నట్లు తెలిపారు.

ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు స్థానంలో…

ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంకు అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, వోటర్ కార్డు.. ఇలాంటివి ఉపయోగించే చోట ఒకే ఐడీ కార్డు ఉండాలని అమిత్ షా అన్నారు. ఇది అవసమని అభిప్రాయపడ్డారు. 2021 జనాభా లెక్కల కోసం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR-జాతీయ జనాభా పట్టిక) కోసం కేంద్రం రూ.1200 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. 2021 సెన్సస్ మొత్తం మొబైల్ యాప్ ద్వారానే సేకరిస్తామని తెలిపారు. దీంతో పేపర్ జనాభా లెక్కలు… డిజిటల్ జనాభా లెక్కలుగా పరివర్తనం చెందుతుందన్నారు.

NPR కూడా..

NPR కూడా..

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టబోతున్న 8వ జనాభా లెక్కల సేకరణ 2021 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుందని అమిత్ షా చెప్పారు. జనాభా లెక్కలకు తొలిసారి మొబైల్ అప్లికేషన్ ఉపయోగిస్తున్నామని, ఇది జనగణనలో విప్లవాత్మక మార్పు కానుందన్నారు. ఈసారి సంపూర్ణ జనగణన కోసం పదహారు భాషల్లో ఆ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. NPRను తయారు చేయబోతున్నట్లు తెలిపారు.

మొబైల్ యాప్‌తో జనగణన

మొబైల్ యాప్‌తో జనగణన

మొబైల్ యాప్ వల్ల జనగణన సులభం అవుతుందని అమిత్ షా చెప్పారు. జనాభా లెక్కల సేకరణలో ఇంకా మార్పులు తీసుకు రావాలన్నారు. జనన, మరణాలను ఓటరు జాబితాలో జోడించడలేమా, పుట్టిన బిడ్డ వివరాలు నమోదైన వెంటనే జనాభా లెక్కల్లో చేరేట్లు చేస్తే జనాభా లెక్కలు వాటంతట అవే తయారు కావా, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ధ్రవీకరణ పత్రం ఇచ్చిన వెంటనే ఓటరు జాబితాలో ఆ పేరు ఆటోమేటిక్‌గా తొలగిపోయేలా చేయకూడదా.. అని అమిత్ షా అన్నారు.

అన్ని సేవలను ఒకే కార్డులోనే ఎందుకు పెట్టలేం

అన్ని సేవలను ఒకే కార్డులోనే ఎందుకు పెట్టలేం

ఆధార్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు వంటి అన్ని సేవలను ఒకే కార్డులోనే ఎందుకు పెట్టలేమని అమిత్ షా అన్నారు. వాటి డేటాను ఒకే కార్డులో పొందుపరిచే వ్యవస్థ ఉండాలని, ఇది సాధ్యమే అన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆలోచన ఏదీ ప్రభుత్వ మదిలో లేకపోయినా అలాంటిది సాధ్యమేనని తాను చెబుతున్నా అన్నారు.

ఆ లెక్క ప్రకారమే సంక్షేమ పథకాలు

ఆ లెక్క ప్రకారమే సంక్షేమ పథకాలు

భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు 2021 జనాభా లెక్కల వివరాలే ప్రామాణికంగా ఉంటాయని అమిత్ షా చెప్పారు. 2011 లెక్కల ఆధారంగా మోడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిందని, జనాభా డేటాను డిజిటల్ రూపంలోకి మార్చడం వల్ల దానిని సాఫ్టువేర్ ద్వారా విశ్లేషఇంచుకొని వివిధ అవసరాలకు ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. 2011 లెక్క ప్రకారం ప్రపంచ జనాభాలో మన వాటా 17.5 శాతమైతే భూభాగం మాత్రం 2.4 శాతమేనని, దీనిపై కళ్లు తెరవాలన్నారు.

డిజిటల్ గణన

డిజిటల్ గణన

2021 జనగణనలో డిజిటల్ సాంకేతికతతో పాటు NPR సమాచారం సేకరిస్తామని అమిత్ షా చెప్పారు. దేశంలో నివసిస్తున్న పౌరుడికి ఏదైనా గుర్తింపు కార్డును మంజూరు చేయాలంటే ఆ వ్యక్తి వివరాలు NPRలో నమోదై ఉండాలి. NPR సమాచారం సేకరించే సమయంలోనే ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు అడుగుతారు. డిజిటల్ జనగణనలో NPRలో సేకరించిన వివరాలతో పాటు ఆధార్ కార్డు, పాస్ పోర్టు నెంబర్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్ కూడా తీసుకుంటారు. డిజిటల్ గణనలో గోప్యతా నిబంధనలను పాటిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here