ఆప్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం

0
2


హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్‌ ఆప్ఘనిస్థాన్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్ ఫిల్ సిమన్స్ పదవీ కాలం కొద్దిరోజుల క్రితం ముగిసిన నేపథ్యంలో అతడి స్థానాన్ని ఆప్ఘన్ క్రికెట్ బోర్డు లాన్స్ క్లూసెనర్‌తో భర్తీ చేసింది. ఇటీవలే హెడ్ కోచ్ పదవి కోసం ఆప్ఘన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) దరఖాస్తులు ఆహ్వానించింది.

దీంతో మొత్తం 50కిపైగా అభ్యర్ధులు ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అన్నింటినీ పరిశీలించిన ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు చివరకు లాన్స్ క్లూసెనర్ వైపు మొగ్గుచూపింది. ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండిస్‌తో జరిగే సిరీస్ లాన్స్ క్లూసెనర్‌కు కోచ్‌గా తొలి విదేశీ పర్యటనకానుంది.

వార్మప్ మ్యాచ్‌లో మర్క్రమ్ సెంచరీ: రెండో రోజు ముగిసిన ఆట, దక్షిణాఫ్రికా 199/4

హెడ్ కోచ్‌గా లాన్స్ క్లూసెనర్ ఎంపికపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈఓ స్టానిక్‌జాయ్ మాట్లాడుతూ “ప్రపంచ క్రికెట్‌లో లాన్స్ క్లూసెనర్ పేరొందిన క్రికెటర్. ఒక ఆటగాడిగా, కోచ్‌గా అతనికున్న అపార అనుభవం తమ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది” అని తెలిపాడు.

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్‌లో సైతం క్లూసెనర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని స్టానిక్‌జాయ్ తెలిపాడు. ఆప్ఘనిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు.

HCA Elections: అజహరుద్దీన్ ఘన విజయం, అధ్యక్షుడిగా ఎన్నిక

ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాన తర్వాత క్లూసెనర్ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో డాల్ఫిన్స్ ఫ్రాంఛైజీకి కోచ్‌గా పనిచేశాడు. ముంబై ఇండియన్స్ టీమ్‌కు బౌలింగ్ కోచ్‌గా, దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా, జింబాబ్వే టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here