ఆయన రక్తం.. 20 లక్షల పసిబిడ్డలకు ప్రాణం పోసింది!

0
0


ది మీకు చిత్రంగానే అనిపించవచ్చు. కానీ, నిజం! ఆయన వల్ల 24 లక్ష పసిబిడ్డలు ప్రాణం పోసుకున్నారు. భవిష్యత్తులో మరెంతో మంది పసిబిడ్డలకు సైతం ప్రాణదాత కానున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ హారిసన్ గురించి తెలుసుకోవల్సిందే.

వాస్తవానికి ఒకసారి రక్తదానం చేస్తే.. రెండోసారి రక్తం ఇచ్చేందుకు కనీసం మూడు నెలలు ఆగాలి. కానీ, హార్రిసన్ మాత్రం అలా కాదు.. ప్రతివారం ఆయన రక్తం దానం చేస్తూనే ఉంటారు. అందుకే ఆయన ‘మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్’ అని పిలుస్తారు. గత 60 ఏళ్లుగా ఆయన చేసిన రక్తదానం వల్ల 2.4 మిలియన్ (20 లక్షలు) మంది పసిబిడ్డలు ప్రాణాలతో ఉన్నారు.

‘సీఎన్ఎన్’ వార్తాసంస్థ కథనం ప్రకారం.. జేమ్స్ రక్తం సాధారణమైనది కాదు. అది ఎంతో ప్రత్యేకమైనది. అతని రక్తంలో వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలు (యాంటీబాడీస్) ఉన్నాయి. అవి ‘యాంటీ-D’ అనే ఇంజక్షన్‌ తయారీకి ఉపయోగపడతాయి. ప్రాణాంతక రీసస్ వ్యాధిబారిన పడే బాధిత చిన్నారులను రక్షించేందుకు ఈ ఇంజక్షన్ ఉపయోగపడుతుంది.

Read also: కాలేజీ బుల్లోడు.. తండ్రి జూనియర్, కూతురు సీనియర్.. వీరి కథ అమోఘం!

గర్భిణీ స్త్రీల రక్తంలో ప్రతిరోధకాలపై ప్రభావం చూపే ‘రీసస్’.. ఆమె కడుపులోని శిశువు రక్త కణాలను నాశనం చేస్తాయి. అలాంటి సమస్య ఉన్న గర్భిణీలకు ఈ ‘యాంటీ-D’ ఇంజక్షన్ ఇస్తారు. జేమ్స్ రక్తంలోని ప్లాస్మాలో ఆ ఇంజక్షన్ తయారీకి అవసరమయ్యే ప్రతిరోధకాలు ఉన్నాయి. ఆయన నుంచి సేకరించే రక్తంలో ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ తర్వాత రక్తాన్ని తిరిగి ఆయనకు ఎక్కించేస్తారు. దీనివల్ల ఆయన ప్రతి వారం రక్తదానం చేయడం సాధ్యమవుతోంది.

Read also: దొంగకు నరకం చూపిన మహిళ.. రూపం కోల్పోయి ఆస్పత్రిపాలు!

ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ సర్వీస్‌కు చెందిన ఫాల్కెన్‌మిర్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో తయారయ్యే ప్రతి ‘యాంటీ-D’ ఇంజక్షన్ జేమ్స్ రక్తం నుంచి తయారవుతున్నదే. ఇక్కడ 17 శాతం మహిళ రీసస్‌ బారిన పడుతున్నారు. ఇలా జేమ్స్.. తన జీవిత కాలంలో లక్షలాది నవజాత శిశువుల ప్రాణాలు కాపాడారు’’ అని తెలిపారు. చూశారుగా.. ఆయన చేసే రక్తదానం ఎంతమంది ప్రాణాలను నిలబెడుతోంది. కాబట్టి.. మీరు కూడా రక్తదానం చేయండి. అది ఏదో ఒక రూపంలో నిండు ప్రాణాలను కాపాడుతుంది.

Photo: APSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here