ఆయుర్వేద పార్కుకు నిధుల కొరత

0
0


ఆయుర్వేద పార్కుకు నిధుల కొరత

నాటినవి 2,750.. పెరుగుతున్నవి 1,500 మొక్కలు

న్యూస్‌టుడే, ఖలీల్‌వాడి (నిజామాబాద్‌)


ఆయుర్వేద పార్కు

ఆధునిక కాలంలో మనిషి జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఇంగ్లీషు మందుల కంటే ఆయుర్వేద ఔషధాల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వర్ని రేంజ్‌ పరిధి చందూరు బీట్‌లో సుమారు నాలుగేళ్ల క్రితం ఆయుర్వేద పార్కు(హెర్బల్‌ గార్డెన్‌) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా కావల్సిన నిధులు మంజూరు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.

చందూరు బీట్‌లో 2015-16 లో ఆయుర్వేద పార్కు కోసం సుమారు నాలుగు ఎకరాల అటవీ స్థలం కేటాయించారు. రూ.7 లక్షలతో దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆరంభంలో రూ.4 లక్షలు మంజూరుకాగా వాటితో కావల్సిన ఏర్పాట్లు చేశారు. మిగతా నిధులు విడుదల చేయకపోవడంతో చాలా పనులు పెండింగులో ఉండిపోయాయి. వీటిని పూర్తి చేయడానికి రూ.3 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.


పెరుగుతున్న ఔషద మొక్కలు

నిర్వహణ లేక..

నిధులు లేక పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. ఆరంభంలో ఉత్తిరేని, నల్లవేము, జిలే్లెడు, వెలగ, ఏగిస, జమ్మి.. ఇలా 22 రకాల 2,750 వనమూలికల మొక్కలు నాటారు. ప్రస్తుతం వీటిలో బతికున్నవి సుమారు 1,500 మాత్రమే.

ప్రతిపాదనలు పంపాం

– సునీల్‌ హిరామత్‌, డీఎఫ్‌వో

కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఆయుర్వేద పార్కును ఏర్పాటు చేశారు. ప్రారరభించిన సమయంలో ఉన్న నిధులతో పనులు చేపట్టారు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు పంపించాం.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here