ఆరోగ్యం.. ఆహ్లాదం

0
3


ఆరోగ్యం.. ఆహ్లాదం

నందనవనాలు.. అంగన్వాడీ కేంద్రాలు

న్యూస్‌టుడే, బీర్కూర్‌

అంగన్వాడీ కేంద్రం ఆవరణలో పెంచుతున్న పూల మొక్కలు

అంగన్వాడీ కేంద్రాలంటేనే అద్దె భవనాలు.. అరకొర వసతులు  ఉంటాయి. కుళ్లిన కూరగాయలతో, ఉడికీ ఉడకని భోజనం చేసి పెడతారనే ప్రచారం ఉంది. బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఎస్సీవాడలో రెండు కేంద్రాలు, దామరంచ కేంద్రాలనూ చూస్తే మాత్రం ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే.

బీర్కూర్‌, దామరంచ అంగన్‌వాడీ కేంద్రాలు నందనవనాలను తలపిస్తున్నాయి. పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకొన్నాయి. స్థానికంగానే సాగు చేస్తున్న తాజా కూరగాయలతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు.

అప్పుడు అధ్వానం : రెండేళ్ల క్రితం వరకు ఈ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉండేవి. పరిసరాల్లోనే మలవత్ర విసర్జన చేసేవారు. మురుగు నిల్వతో దోమలు, ఈగలు విజృంభించేవి. పందులు స్వైర విహారం చేసేవి. నిర్వాహకులు శ్రమించి పరిసరాలను పూర్తిగా మార్చేశారు.

తాజా కూరలతో.. : టమాటా, తోటకూర, చామకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, చిక్కుడు, బెండకాయ, మునగ, కాకరకాయ సాగు చేస్తున్నారు.

పూల వనం.. : మల్లె, బంతి, చామంతి, ఎర్ర, తెల్ల మందారం, చక్రం పువ్వులు, గులాబీ, ఎర్ర గన్నేరు, రాధాకృష్ణ పువ్వులు, మే పుష్పం వంటివి నయనానందం కలిగిస్తున్నాయి.

పండ్ల తోట : దానిమ్మ, సీతాఫలం, మామిడి, జామ వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

బీర్కూర్‌ అంగన్వాడీ కేంద్రంలో పెరటి తోటలో ఆడుతున్న చిన్నారులుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here