ఆర్జీవీ కేఆర్ కేఆర్: అంతా ఏపీ పాలిటిక్సే: బాబు, పవన్, జగన్ చుట్టే: తొలిపాటలో సంచలన దృశ్యాలు!

0
0


ఆర్జీవీ కేఆర్ కేఆర్: అంతా ఏపీ పాలిటిక్సే: బాబు, పవన్, జగన్ చుట్టే: తొలిపాటలో సంచలన దృశ్యాలు!

అమరావతి: వివాదాస్పద దర్శకుడిగా కావాలనే ముద్రను సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ లేెటెస్ట్ మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. పేరుకు తగ్గట్టే ఈ సినిమా మొత్తం వివాదాల మయంగా కనిపిస్తోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలు కమ్మ, రెడ్డిల పేరుతో సినిమా తీసే సాహసానికి పూనుకున్న ఆయన.. చెప్పింది చేస్తున్నాడు. ఊహించినట్టే.. ఈ సినిమా తొలి పాట ట్రైలర్ ను విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆవిష్కరించారు. ఈ పాటకు సంబంధించిన యుట్యూబ్ లింక్ ను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన తీసిన తాజా సినిమాకు మోస్ట్ నాన్ కాన్ట్రవర్సియల్ మూవీ అని దానికి ట్యాగ్ లైన్ తగిలించారు. మోస్ట్ నాన్ కాన్ట్రవర్షియల్ మూవీ అని చెబుతూనే.. మోస్ట్ కాన్ట్రవర్సియల్ క్యారెక్టర్స్ అని తాజాగా దాన్ని పొడిగించారు.

ఈ పాటలో ఏముంది?

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో ఈ ట్రైలర్ ఆరంభమౌతుంది. ఈ పాటలో ఏముంది అన ప్రశ్నకు ఎన్నో ఉన్నా, ఏమీ లేనట్టుగా కనినిస్తుంది ఈ ట్రైలర్. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ గా వినిపిస్తుంటుంది. తొలి పాట అన్న మాటే గానీ..ఎక్కడే గానీ రామ్ గోపాల్ వర్మ సొంతంగా తీసిన సన్నివేశాలు కనిపించవు. ఎన్నికల ప్రచార సన్నివేశాలు, అసెంబ్లీ బడ్జెట్ దృశ్యాలతో పాట మొత్తాన్నీ నింపేశారు. 4 నిమిషాల 25 సెకెన్ల నిడివి ఉండే ఈ పాట ట్రైలర్ మొత్తం వాడివేడిగా కనిపిస్తుంది. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మధ్య సాగిన ఆగ్రహావేశాలు, ఆ ఇద్దరు నేతల మధ్య చోటు చేసుకున్న సంభాషణల తాలూకు డైలాగులతో ట్రైలర్ ను నింపేశారు. మధ్య మధ్యలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అచ్చెన్నాయుడినీ జొప్పించారు రామ్ గోపాల్ వర్మ. స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహార శైలి, బడ్జెట్ సమావేశాలపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన క్లిప్పింగులను ఇందులో చూపించారు.

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నాడే టైటిల్ ప్రకటన..అందుకే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంగా.. విజయవాడ సహా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన రామ్ గోపాల్ వర్మ.. అప్పటికప్పుడు ఈ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యలో నివసించే ఈ రెండు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు చెందిన రెడ్లు పెద్ద సంఖ్యలో కనిపించడం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని అప్పట్లో వ్యాఖ్యానించారాయన. ఖద్దరు చొక్కా, తెల్ల పంచెలు ధరించి, తెల్ల సుమో వాహనాల్లో తిరిగే నాయకులు సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుంటారని అన్నారు. తాను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తిరుగుతుంటే రాయలసీమలో కలియ తిరుగుతున్నట్టే అనిపించిందని తెలిపారు.

హవా కడప రెడ్లదేనా?

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఏ రేంజ్ లో వివాదాలను రేకెత్తించిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకంపనలు సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్రను ప్రధాన విలన్ గా ఈ సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీ రామారావు ఎలా పదవీచ్యుతుడయ్యారనే విషయం చుట్టూ తిరిగిన ఈ సినిమా.. తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలపై కొద్దో, గొప్పో ప్రభావం చూపి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చిన రామ్ గోపాల్ వర్మను పోలీసులు బలవంతంగా తరిమేయడం అప్పట్లో పెద్ద వివాదాన్నే రేకెత్తించింది.

సుమోలు, ఖద్దరుచొక్కాలతో సినిమా కనిపించడం ఖాయమట..

సుమోలు, ఖద్దరుచొక్కాలతో సినిమా కనిపించడం ఖాయమట..

కమ్మ సామాజిక వర్గ నాయకులకు చెందిన హోటల్ గేట్ వేలో రాయలసీమ రెడ్లు పెద్ద సంఖ్యలో దిగారనీ, వాటన్నింటినీ చూసి తాను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు కథను రాసుకున్నానని తెలిపారు. విజయవాడ రోడ్లపైనా తనకు ఇలాంటి వాతావరణమే కనిపించిందని రామ్ గోపాల్ వర్మ అప్పట్లో చెప్పుకొచ్చారు. తాను ప్రత్యక్షంగా తిలకించిన, అనుభవించిన ఉదంతాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకు అవసరమైన కథను రాసుకున్నారట రామ్ గోపాల్ వర్మ. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. సినిమా కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందని చెబుతున్నారు. దసరా సెలవుల నాటికి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కమ్మ వాళ్లే విలన్ గా మరోసారి..

కమ్మ వాళ్లే విలన్ గా మరోసారి..

లక్షీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగుదేశం పార్టీకి గానీ, ఆ పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గ నేతల ఇమేజ్ కు ఎంతో కొంత డ్యామేజీ చేసిందని అంటున్నారు. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మూవీ కూడా అదే స్థాయిలో వివాదాల తేనెతుట్టెను కదిలించే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కమ్మ వారిని విలన్ గా చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే ఈ సినిమా కాస్త వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పిని తీసుకుని రాలేదనే గ్యారంటీ లేదు. ఈ సినిమాను అడ్డు పెట్టుకుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆందోళనలను చేపట్టడానికి అవకాశం ఉందని, ఫలితంగా- శాంతిభద్రతల సమస్య తలెత్తడం ఖాయమని అంటున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here