ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీజిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అద్యక్ష్యుడు బాణాల లక్మరెడ్డి మాట్లాడారు. రెండవ సారి కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందేనన్నారు. దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు కావాలని తప్పు దోవ పట్టిస్తున్నాయని, అందువల్ల ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు 370 రద్దు విషయమై అవగాహన కొరకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా డాక్టర్లు , రిటైర్డు ఉద్యోగస్తులు, న్యాయవాదులు, మేధావులతో సమావేశమయ్యామని చెప్పారు. కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది దిలీప్‌ కుమార్‌ దుబే మాట్లాడుతూ భారత స్వతంత్ర అనంతరం హైదరాబాద్‌, మైసూర్‌, కాశ్మిర్‌ సంస్థానాలు కొన్ని రోజులు స్వతంత్రంగా వ్యవహరించాయని తరువాత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. మహారాజా హరిసింగ్‌ కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం (ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ అసెషన్‌) తో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైందని అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here