ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన సమావేశం

0
2


ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన సమావేశం

మాట్లాడుతున్న బాణాల లక్ష్మారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టికల్‌ 370 రద్దుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 30న కామారెడ్డికి కేంద్ర మంత్రి శ్రీపాద్‌నాయక్‌ రానున్నట్లు భాజపా జిల్లాధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజిరెడ్డి గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి కవులు, కళాకారులు, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైద్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో తెలంగాణ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరమణారెడ్డి, ప్రతినిధులు అరుణతార, నీలం చిన్నరాజులు తదితరులు పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here