ఆర్టికల్ 370 రద్దు: జమ్ము కాశ్మీర్‌కు పెట్టుబడుల కొత్త ఉత్సాహం!

0
0


ఆర్టికల్ 370 రద్దు: జమ్ము కాశ్మీర్‌కు పెట్టుబడుల కొత్త ఉత్సాహం!

శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్ము కాశ్మీర్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక ప్రతిపత్తి, ఉగ్రవాద చర్యల కారణంగా పెట్టుబడులు పెద్దగా లేవు. ఇప్పుడు దీనిని రద్దు చేసిన నేపథ్యంలో పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.

JSW Group గ్రూప్ సజ్జన్ జిందాల్

ఆర్టికల్ 370 రద్దును తాను ఎప్పుడూ కోరుకున్నానని, ఇప్పుడు అది రద్దయిందని జెఎస్‌డబ్ల్యు గ్రూప్ సజ్జన్ జిందాల్ అన్నారు. రాజకీయ కారణాలతో ఆలస్యమైందని, ఆర్టికల్ 370 రద్దు అంశంపై తాను బీజేపీకి సంపూర్ణ మద్దతు పలుకుతున్నాని చెప్పారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయడం సంతోషకరమన్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు గొప్ప ముందడుగు వేశారన్నారు. ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్‌ను మరింత ముందుకు తీసుకెళుతుందని, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

RPG Enterprises హర్షా గోయెంకా

RPG Enterprises హర్షా గోయెంకా

ఆర్టికల్ 370 ఉపసంహరణ చారిత్రాత్మక నిర్ణయమని RPG Enterprises హర్షా గోయెంకా అన్నారు. 1980లలో జమ్ము కాశ్మీర్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో తన తండ్రి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్బుతమని, ఇది ల్యాండ్ మార్క్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

Mahindra Group ఆనంద్ మహీంద్రా

Mahindra Group ఆనంద్ మహీంద్రా

ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం చాలా ముందే తీసుకోవాల్సిందని, ఈ రోజు నిర్ణయం చరిత్రాత్మకమని, కాశ్మీరీలు నిజమైన భారతీయులుగా మారనున్నారని మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. యావత్ భారతదేశం దీని కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తోందన్నారు. అక్కడి వారు అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భారత సమాజంలో విడదీయరాని బంధం కాశ్మీరీలది అని, దీనిని కాశ్మీరీలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందన్నారు.

Adani Group గౌతమ్ అదానీ

Adani Group గౌతమ్ అదానీ

జమ్మూ కాశ్మీర్‌లో అభివృద్ధి, శాంతికి ఆర్టికల్ 370 రద్దు తోడ్పడనుందని, కాశ్మీర్‌ ప్రజలతో పాటు భారత్‌ మరింత బలోపేతం కానుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. జమ్ము కాశ్మీర్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఆర్టికల్ 370 రద్దు బాటలు పరుస్తుందని, బీజేపీ మేనిఫెస్టోలోని హామీని నెరవేర్చిందని, దేశంలో మెజార్టీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారని పీహెచ్‌డీ చాంబర్ అధ్యక్షులు రాజీవ్ తల్వార్ అన్నారు.

Jaypee Group మనోజ్ గౌర్

Jaypee Group మనోజ్ గౌర్

ఈ నిర్ణయంతో ప్రతి పౌరుడు గర్విస్తున్నాడని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ అన్నారు. జీఎస్టీ తర్వాత దేశమంతా ఒకే ట్యాక్స్ వచ్చిందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ పరిపూర్ణంగా కలవడంతో భారత్ అంతా ఒకే దేశంగా మారిందని మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ సీఎండీ మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. ఇది చారిత్రక దినమని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ ఎండీ&సీఈవో ఆశిష్ చౌహాన్ అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here