ఆర్టికల్ 370 రద్దు, ప్రపంచం ముందు పాకిస్థాన్ ఏకాంగి, చైనా సైలెంట్, ఏం చెయ్యాలి, దెబ్బకు !

0
0


ఆర్టికల్ 370 రద్దు, ప్రపంచం ముందు పాకిస్థాన్ ఏకాంగి, చైనా సైలెంట్, ఏం చెయ్యాలి, దెబ్బకు !

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యర్థి పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారత్ మీద ఎదురుదాడికి దిగిన పాకిస్థాన్ నేడు ప్రపంచ దేశాల ముందు ఏకాంగి అయ్యింది. ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అనే సామెత పాకిస్థాన్ కు కచ్చితంగా సరిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని పాకిస్థాన్ ఆలోచిస్తోంది.

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ ప్రపంచ దేశాల ముందు వాపోయింది. ఆర్టికల్ 370ని రద్దు చెయ్యడాన్ని ఇప్పటి వరకు పాకిస్థాన్ మాత్రమే వ్యతిరేకించింది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన భారత్ గురించి ఇప్పటి వరకూ ఏ దేశం కూడా మాట్లాడలేదు.

భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క పాకిస్థాన్ మాత్రమే మాట్లాడుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన భారత్ తీరును ఇప్పటి వరకూ ఏ దేశం ఖండించలేదు, అలాగని ఈ విషయంలో స్పందించనూ లేదు. భారత్ విషయంలో ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటంతో పాకిస్థాన్ ఏం చెయ్యాలో దిక్కుతోచక ఏకాంగి అయ్యింది.

పాకిస్థాన్ మిత్ర దేశం చైనాతో సహ ప్రపంచంలోని ఏ ముస్లీం దేశం సైతం కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు విషయంలో మౌనంగానే ఉండటంతో పాకిస్థాన్ షాక్ కు గురైయ్యింది. భారత్ అక్రమంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటే తాము సరైన సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని పాకిస్థాన్ హెచ్చరించింది

పాకిస్థాన్ కు కాశ్మీర్ తో ఉన్న సంబంధాలు ఇలాగే ఉండాలని కొరుకుంటున్నామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ చెప్పింది. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలకు, రాజకీయ పార్టీలకు సమాధానం చెప్పలేక పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సతమతం అవుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here