ఆర్టికల్ 370 రద్దు: బిజినెస్ కు ఎలాంటి ముప్పు? దీర్ఘకాలంలో మేలు

0
0


ఆర్టికల్ 370 రద్దు: బిజినెస్ కు ఎలాంటి ముప్పు? దీర్ఘకాలంలో మేలు

భూతల స్వర్గం జమ్మూ అండ్ కాశ్మీర్ కు కొన్ని ప్రత్యేక అధికారాలను కట్టబెట్టిన ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది. దాంతో పాటే 35 ఏ కూడా రద్దు కావడం తో భారత్ దేశానికి మొత్తం అమలు అయ్యే రాజ్యాంగమే ఇకపై జమ్మూ అండ్ కాశ్మీర్ కు కూడా వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే ముందు రహస్యంగా చాలా కసరత్తు చేసింది. ఎంతో సున్నితమైన అంశంపై చాకచక్యంగా వ్యవహరించింది. అల్లర్ల ను ముందస్తుగా పసిగట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లను చేసింది. తెలీకమ్యూకేషన్స్, ఇంటర్నెట్ సేవలను సైతం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ప్రక్రియ లో భాగంగా కర్ఫ్యూ కూడా విధించింది. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తో పాటు, జమ్మూ అండ్ కాశ్మీర్ ను మూడు ముక్కలుగా విభజిస్తుండం తో సరికొత్త రాజకీయ, ఆర్థిక, సామజిక పర్యవసానాలు ఏమిటని నిపుణులు శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, బిజినెస్ లకు ఏమైనా ముప్పు ఉందా .. వంటి అంశాలపై ప్రత్యేక కథనం మీ కోసం.

ఇబ్బంది తాత్కాలికమే…

ప్రస్తుతం కేంద్రం తీసుకొన్న నిర్ణయం వల్ల అనేక రంగాలపై వ్యతిరేక ఫలితాలు ఉండబోతున్నాయి. కొన్ని రకాల బిజినెస్ లకు తాత్కాలిక ముప్పు తప్పక పోవచ్చు. కానీ … దీర్ఘకాలంలో ఈ నిర్ణయం ప్రభావం తగ్గి పోయి శాంతి నెలకొంటే … మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ … స్టాక్ మార్కెట్ లేదా వాణిజ్య మార్కెట్లను ప్రభావితం చేసేంత బలమైన మార్కెట్ కాదు. కాబట్టి ఈ రకమైన ప్రభావం ఏదైనా ఉన్న… అతి స్వల్ప కాలంలో అది సమసిపోతుంది. ఈ రాష్ట్రం మెరుగైన పారిశ్రామిక రాయితీలు ఇచ్చినా అక్కడ పెద్దగా పెట్టుబడులు రాలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు పారిశ్రామిక పెట్టుబడులపై ప్రభావం స్వల్పమే కానుంది.

దెబ్బ తిననున్న ట్రావెల్ అండ్ టూరిజం రంగాలు...

దెబ్బ తిననున్న ట్రావెల్ అండ్ టూరిజం రంగాలు…

భారత్ లో టూరిజం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందే రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఒకటి. ఇది టూరిస్టుల స్వర్గధామం కాబట్టి, ప్రముఖ వేసవి కాల విడిది కేంద్రం కాబట్టి ఇక్కడికి దేశ, విదేశి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఏటా సగటున 1.5 కోట్ల పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారు. ఇందులో ఒక లక్ష వరకు విదేశీ టూరిస్టులు వస్తుంటారు. తద్వారా ఈ రాష్ట్రం లో టూరిజం రంగంలో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ రంగంపై ఆధారపడి నడిచే ఆతిథ్య రంగం (హోటల్స్) కూడా బాగా దెబ్బతినే అవకాశం ఉంది. కుటీర పరిశ్రమ కూడా అధికంగా ఉపాధిని కల్పిస్తుంది. శాలువాలు, స్వేట్టర్లు, సిల్క్ ఉత్పత్తులు, కార్పెట్లు వంటి ఉత్పత్తులను తయారు చేసి, టూరిస్టులకు అమ్మి జీవనోపాధి పొందుతుంటారు. కాబట్టి … మొత్తం ఉద్యోగాల్లో సింహ భాగం టూరిజం, అనుబంధ రంగాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో ఈ రంగంపై ఆధారపడి పనిచేసే వారు ఇబ్బంది పడనున్నారు. టూరిస్టు బస్సులు, కార్లు, వాహనాల రంగం కూడా దెబ్బతిన్ననున్నాయి. విమానయానం కూడా ఈ ప్రభావాన్ని చవిచూడనుంది.

పెరగనున్న ఆపిల్, కుంకుమ పువ్వు ధరలు...

పెరగనున్న ఆపిల్, కుంకుమ పువ్వు ధరలు…

దేశం లో కాశ్మీర్ ఆపిల్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. అలాగే కుంకుమ పువ్వు లభించే ఏకైక మార్కెట్ కాశ్మీర్ కావటం తో దేశ వ్యాప్తంగా అటు ఆపిల్స్, ఇటు కుంకుమ పువ్వు ధరలు పెరిగే అవకాశము ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రాష్ట్రం ఏటా సుమారు 20 లక్షల టన్నుల ఆపిల్స్ ను ఉత్పత్తి చేసి మార్కెట్ కు అందిస్తుంది. ప్రస్తుత పరిణామాల్లో సరఫరా తగ్గే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

అతి తక్కువ విదేశీ పెట్టుబడులు...

అతి తక్కువ విదేశీ పెట్టుబడులు…

అశాంతి నెలకొని, టెర్రరిస్టు కార్యకలాపాలతో నిత్యం రణరంగం లా ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెట్టుబడులకు ఇటు దేశేయా పెట్టుబడిదారులే కాకుండా అటు విదేశీ ఇన్వెస్టర్లు కూడా ముందుకు రాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే… గత 20 ఏళ్ళ లో ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశి ప్రత్యక్ష పెట్టుబడి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ 70 కోట్లు ) మాత్రమే కావడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి ఉద్రిక్తల మధ్య టూరిజం, దాని అనుబంధ రంగాలు తప్ప వేరే పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేసే సాహసం చేయలేదు.

రూ 1.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ...

రూ 1.5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ…

ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా … జమ్ము అండ్ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని చెప్పాలి. సుమారు 1.30 కోట్ల మంది జనాభా కలిగిన ఈ రాష్ట్రం … దశాబ్ద కాలంగా సగటున 10% ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. 208-19 లో సుమారు 12% వృద్ధి రేటుతో జమ్మూ అండ్ కాశ్మీర్ జీడీపీ రూ 1.57 లక్షల కోట్లుగా ఉంది. దీనికి టూరిజం, దాని అనుబంధ రంగాలు, వ్యవసాయ, హార్టికల్చర్ రంగాలు దన్నుగా ఉన్నాయి. అయితే, ఎక్కువ కాలం ఉద్రిక్తలు నెలకొంటే… ఆ రాష్ట్ర జీడీపీ పై నెగటివ్ ప్రభావం పడుతుంది. ప్రజలు ఉపాధి కోల్పోవడం వల్ల వినియోగం తగ్గిపోతుంది. రుణాలు తీసుకొన్నవారు సక్రమంగా వాటిని తిరిగి చెల్లించలేరు. కాబట్టి నిరర్థక ఆస్తులు పెరిగే ప్రమాదం ఉంది. దీని ప్రభావం స్వల్పంగా నైనా .. భారత దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుందని చెప్పాలి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు పతనవుతూ… ఆటో సేల్స్ పడిపోతూ మందగమనం లోకి జారుకొంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు కొంత ఇబ్బంది కరమైన వాతావరణమనే చెప్పాలి.

దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు...

దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు…

కాగా… దీర్ఘకాలం లో మాత్రం ఈ రాష్ట్రం లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఆర్టికల్ 370, 35 ఏ రద్దు తో భారతీయులు ఎవరైనా అక్కడ స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. ఆ రాష్ట్రంలో ఎవరైనా స్థిర నివాసం ఏర్పరచు కోవచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపవచ్చు. ఉపాధి అవకాశాలు పెరిగితే సహజంగానే ఇతర రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రానికి వలసలు పెరుగుతాయి. కాబట్టి విద్య, ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక రంగాల్లో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ… అక్కడ శాంతి నెలకొంటేనే ఇవన్నీ జరుగుతాయని వారు తేల్చి చెబుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here