ఆర్టీసి మిలియన్‌ మార్చ్‌ అడ్డగింత

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ మిలియన్‌ మార్చ్‌ వెళ్లకుండా అక్రమంగా ఆర్టీసీ కార్మికులను, నాయకులను అఖిలపక్షం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో సిపిఎం ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం సిపిఎం ఆర్మూరు కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం 37వ రోజు కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నియంత పాలనకు చరమగీతం పాడటానికి శనివారం హైదరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు ట్యాంకుబండ్‌పై వేలాది మందితో మిలియన్‌ మార్చ్‌ నిర్వహించతలపెట్టామన్నారు. కానీ అక్కడికి వెళుతున్న నాయకులను ఆర్టీసీ కార్మికులను అఖిలపక్ష నాయకులను దొంగల్లాగా శుక్రవారం నుండి వచ్చి అక్రమంగా అరెస్టు చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హైకోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అందుకే తిక్కతిక్కగా మాట్లాడే పద్ధతి పరిస్థితులు ముఖ్యమంత్రికి వచ్చాయని, కార్మికులను యూనియన్‌ నాయకులు రెచ్చగొడుతున్నారని యూనియన్‌లో అక్కర్లేదని, మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. 50 వేల కుటుంబాలను రోడ్డున పడేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here