ఆర్టీసీ కార్మికుల దీక్ష.. మానవహారం

0
2


ఆర్టీసీ కార్మికుల దీక్ష.. మానవహారం

ఆర్టీసీ కార్మికుల దీక్షకు సంఘీభావం తెలుపుతున్న వినయ్‌రెడ్డి

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో మంగళవారం రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. భాజపా నియోజకవర్గ బాధ్యుడు పి.వినయ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు ఉదయ్‌, నరేందర్‌, ప్రతాప్‌ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. వినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తూ కార్మికుల ప్రాణాలను బలిగొంటుందని విమర్శించారు. అధికార పార్టీ నేతలు ఆర్టీసీ ఆస్తులపై కన్నేసారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు భాజపా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఐకాస నాయకులు నర్సింలు, రవి, చక్రవర్తి, రమేశ్‌, అహ్మద్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here