ఆర్థికమాంద్యం ఉన్నా కూడా ఏ పథకం ఆగదు

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్థిక మాంద్యంతో డబ్బులకు ఇబ్బందిగా ఉన్నా కూడా పేదలు, రైతులను ఆదుకునే ఏ పథకాలు కూడా ఆపబోమని రాష్ట్ర ఆర్‌అండ్‌బి, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో గొర్రెలను, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా బీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాలుగా కడుపు కట్టుకొని పనిచేస్తున్నారని రెండు వందల కిలోమీటర్లు దూరం నుండి కాలేశ్వరం నీటిని ఉల్టా తీసుకువచ్చామని ఇప్పుడు నీటి సమస్య లేదన్నారు. పొలాల్లోకి నీళ్లు రావాలని తపన నెరవేరిందన్నారు. తమపై, ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు లేవన్నారు. 22వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని కరెంటుని బాగా చేసుకున్నామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని, ఇతర పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి పెన్షన్లు 2 వేల రూపాయలు ఇస్తున్నామని 57 ఏళ్ల వయసు వారికి కూడా పెన్షన్లు ఇవ్వడానికి వివరాలు సిద్ధం చేశామన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డ కూడా పండుగ రోజున పాత చీర కట్టుకోకుండా ఒక అన్నగా, ఒక మేనమామగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త చీరలు అందిస్తున్నారని, పండుగనాడు పేద మహిళల కళ్ళల్లో ఆనందం చూడాలనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేశ్వరం పనులు ఆపకూడదనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here