ఆర్బీఐ నాలుగోసారి రెపో రేటును తగ్గించే అవకాశం, కారణాలివే

0
4


ఆర్బీఐ నాలుగోసారి రెపో రేటును తగ్గించే అవకాశం, కారణాలివే

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం నిర్వహించనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్షపై సర్వత్రా చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గిస్తుందా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ కేలండర్ ఇయర్‌లో మూడుసార్లు వడ్డీ రేటును తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 5.75కు తగ్గింది. ఇప్పుడు మరోసారి తగ్గిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అలా చేస్తే కనుక మరో 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తే 5.75 శాతం నుంచి 5.50 శాతం అవుతుంది.

ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉండటం వల్ల ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అయిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్న తరుణంలో వడ్డీ రేట్లు తగ్గిస్తే వృద్ధికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

గత జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి 5.8 శాతంగా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. జీడీపీ వృద్ధి మాత్రం వెనక్కి పోతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ మరోసారి రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించి, ఇలాంటి నిర్ణయాలకు అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇచ్చింది. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 3.18 శాతంగా ఉంది. ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కంటే తక్కువ. ఏడాది కాలంగా ఇది అదుపులో ఉంది. రానున్న కాలంలోను మరీ పెరగకపోవచ్చు. ఆటో మొబైల్ అమ్మకాలు భారీగా తగ్గిపోతున్నాయి. బీమా ప్రీమియం, ఇంధనాల ధరల్లో పెరుగుదలతో పాటు రుణాలపై వడ్డీ రేట్లు కూడా పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి. ఇలా పలు కారణాల వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here