ఆర్బీఐ షాకింగ్: ఈ బ్యాంక్‌లో రూ.1,000కి మించి విత్‌డ్రా చేయలేరు

0
2


ఆర్బీఐ షాకింగ్: ఈ బ్యాంక్‌లో రూ.1,000కి మించి విత్‌డ్రా చేయలేరు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు(PMC)పై కస్టమర్లకు షాకిచ్చే కొన్ని ఆంక్షలు జారీ చేసింది. ఆర్బీఐ విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇది బ్యాంకు కస్టమర్లకు బ్యాడ్ న్యూసే. కొత్త ఆంక్షల ప్రకారం వచ్చే ఆరు నెలల వరకు ఈ బ్యాంకు రుణాలు ఇవ్వవద్దు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు తెరువవద్దు. అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్లకు మరీ ఇబ్బందికర విషయం ఏమంటే రూ.1000 ట్రాన్సాక్షన్ లిమిట్ మాత్రమే నిర్ణయించింది.

రూ.1000 కంటే విత్ డ్రా చేసుకోలేరు… ఆర్బీఐ ఏం చెప్పింది?

ఆర్బీఐ నిబంధనల మేరకు ఈ బ్యాంకుకు చెందిన సేవింగ్స్, కరెంట్ లేదా ఇతర అకౌంట్ డిపాజిటర్స్ రూ.1000 కంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేసుకోలేరని ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ చెప్పారు. ఆర్బీఐ డైరెక్షన్స్ ప్రకారం షరతులకు లోబడి ప్రతి సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా లేదా ఇతర డిపాజిట్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో రూ.1000కి మించి ఉపసంహరించుకోలేరు.

వీటిపై కూడా ఆంక్షలు

వీటిపై కూడా ఆంక్షలు

ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మరియు అడ్వాన్స్‌లను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, ఎలాంటి పెట్టుబడులు పెట్టడం, ఎలాంటి ఫ్రెష్ డిపాజిట్స్ ఆమోదించడం వంటివి చేయరాదు. అయితే దీని ఉద్దేశ్యం ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేయబడిందని కాదని కూడా స్పష్టత ఇచ్చింది.

అప్పటి దాకా ఆంక్షలు...

అప్పటి దాకా ఆంక్షలు…

తదుపరి నోటీసులు లేదా సూచనలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. ఈ కొత్త ఆర్బీఐ ఆంక్షలను ప్రతి డిపాజిటర్‌కు పంపించాలని కూడా బ్యాంకుకు సూచించింది. ఇది బ్యాంకు వెబ్ సైట్‌లోను ప్రదర్శిస్తారు.

కస్టమర్ల ఆందోళన… క్యూ

ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో భయాందోళనకు గురైన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు వేలాదిమంది నార్త్-ఈస్ట్ ముంబైలో గల భాండూప్ హెడ్ క్వార్టర్ వద్దకు తరలి వచ్చారు. అలాగే దేశంలోని వివిధ శాఖలకు కూడా చాలామంది వచ్చారు. ఆర్బీఐ టాప్ 10 సహకార బ్యాంకుల్లో ఇది ఒకటి. 1984లో ముంబైలో ఓ చిన్న గదిలో స్థాపించబడిన ఈ బ్యాంకు ఇప్పుడు ఆరా రాష్ట్రాల్లో 137 శాఖలను కలిగిఉంది.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

పెద్ద ఎత్తున బ్యాంకు కార్యాలయాలకు కస్టమర్లు తరలి వస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వీరిని నియంత్రించేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతా సిబ్బందిని నియమించారు.

బ్యాంకు ఎండీది బాధ్యత

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బ్యాంకు ఎండీ జాయ్ థామస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు పశ్చాత్తాప పడుతున్నామని, దీని వల్ల ఆరు నెలల పాటు తమ బ్యాంకు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాంకు ఎండీగా దీనికి బాధ్యత తనదేనని చెప్పారు. ఆరు నెలల్లో మా లోపాలను సరిదిద్దుతామని డిపాజిటర్లకు హామీ ఇస్తున్నామన్నారు. అవకతవకలను సరిదిద్దడం ద్వారా ఆంక్షలు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తామని, మీ అందరికీ ఇది చాలా కష్టమైన సమయమని తనకు తెలుసునని, నేను క్షమాపణలు చెప్పినంత మాత్రాన మీ బాధను పోగొట్టలేనని తెలుసునని, దయచేసి మాతో సహకరించాలని కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా ఈ పరిస్థితిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బ్రాంచీలు

కాగా, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు(PMC)షెడ్యూల్డ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు. దీనికి మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో బ్రాంచీలు ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here