ఆర్మూర్‌లో కార్డెన్‌ సెర్చ్‌

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మామిడి పల్లి గ్రామంలో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ పిఎస్‌ పరిధిలోని మామిడి పల్లి గ్రామంలో దాదాపు 150 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, మొత్తం 51 దిచక్ర వాహనాలు, ఆటో, ట్రాక్టర్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో సిపి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు బృందాలు ఏర్పాటు చేసి, దాదాపు 350 ఇండ్లను తనిఖీలు చేశామన్నారు. ఎవరు కూడా ఎలాంటి పరిచయం, ఆధారాలు లేనిదే ఇల్లు కిరాయికి ఇవ్వరాదని, కొత్త వ్యక్తి కనబడితే దగ్గరలోని పోలిస్‌ వారికి సమాచారం అందించాలన్నారు. ఎవరు కూడా తమ వాహనాలను ఇతరులకు ఇవ్వరాదని, ఇతరులు వాహనాలను తీసుకొని వెళ్లి నేరం చేస్తే వాహన యజమానిపై కేసు నమోదుచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, వాహనాల పేపర్లు తెచ్చి తమ వాహనాలను తీసుకొని వెళ్లాలన్నారు. సరియైన పత్రాలు లేనివారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్థానిక ప్రజలు చట్టవ్యతిరేకమైన కలాపాలు వారి ప్రాంతాల్లో నడుస్తున్నాయని తెలపడంతో, సంబందిత అధికారులు త్వరలోనే వాటిని నిర్మూలించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా సంబంధిత పోలీసు సిబ్బందికి తెలియజేసి వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు. అలాగే డయల్‌ 100 ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here