ఆర్మూర్‌ ప్రజల ఓట్లతో రాజభోగాలు

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వారికి రెండు పడక గదుల ఇళ్ళు కట్టివ్వలేదని, జర్నలిస్టులకు కూడా ఇండ్ల నిర్మాణం చేయిస్తానని చెప్పి వారిని మోసం చేశాడని ఎంఆర్‌పిఎస్‌ జిల్లా మాజీ ఉపాద్యక్షులు మైలారం బాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం రోడ్లు, భవనాల అతిథి గహంలో విలేకరులతో మాట్లాడారు. పేదలకు ఇండ్లు కట్టించే ప్రయత్నం కూడా చేయని జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ నడి బొడ్డున కోట్లాది రూపాలతో షాపింగ్‌ కాంప్లేక్స్‌ నిర్మిస్తున్నాడని అరోపించారు. ఇటీవలి కాలంలో హైద్రాబాద్‌లో 24 కోట్ల రూపాయలతో ఇంటిని కొనుగోలు చేసి గహప్రవేశం కూడా చేశారని ఆయన మండి పడ్డారు. అవినీతి ఎమ్మెల్యేకు నిరుపేద ప్రజల తరుపున నిరసన అబినందనలు తెలియజేశారు. పట్టణంలో ఇండ్లు లేక నానా అవస్థలు పడుతున్న ప్రజలపై దష్టి లేదని, కానీ జీవన్‌ రెడ్డికి మాత్రం సొంత ఇల్లు, ప్రభుత్వ అతిథి గహం, అంకాపూర్‌లో గెస్ట్‌ హౌస్‌, అవి చాలదు అన్నట్లు తహసీల్దార్‌ కార్యాలయం పక్కన అధికారిక గెస్ట్‌ హౌస్‌ నిర్మించాడని అన్నారు. ఈ మధ్యనే పకుర్‌ గుట్టను కూడా కొనుగోలు చేశాడని ప్రజలకు ఇండ్లు కట్టించడానికి డబ్బులు లేవని మరి ఇవన్నీ చేయడానికి ఎక్కడినుండి డబ్బులు వస్తున్నాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో బాబు, ప్రభాకర్‌, భూమేశ్వర్‌, మార్క్‌, సంతోష్‌, విప్లవ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here