ఆర్మూర్‌ శాంతి కమిటీ సమావేశం

0
4నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండల పరిధిలో శుక్రవారం క్షత్రియ కళ్యాణ మండపంలో వినాయక చవితి పండుగను దష్టిలో పెట్టుకొని శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ శాఖల అదికారులు పాల్గొని మాట్లాడారు. ఆర్మూర్‌ ఏసిపి అందె రాములు మాట్లాడుతూ గణేష్‌ పండగను ప్రజలు శాంతి యుతంగా నిర్న్వహించుకోవాలని, ఎలాంటి సంఘర్షణలకు తావివ్వదని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని అయన సూచించారు. ఆర్మూర్‌ తహసీల్దార్‌ రాణా ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ గణేష్‌ మండపాల వద్ద రోజుకు ఇద్దరు చొప్పున గస్తిగా విధిగా ఉండాలని తెలిపారు. పట్టణ ఎస్‌హెచ్‌ఓ రాఘవేందర్‌ మాట్లాడుతూ గణేష్‌ చవితి ఉన్న 11 రోజులు మండపాల యువకులు అప్రమత్తంగా ఉండాలని, డిజేలు నిర్వహించవద్దని, అసభ్య సంగీత పాటలు కాకుండా భక్తి పాటలు ఉండేలా చూసుకోవాలని, మండపాల చుట్టూ ఉన్న సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆయన అన్నారు. శాంతి సమావేశంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ రవాణా, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించాలని నిమజ్జనం రోజు దాదాపు 4 నుండి 5 వరకు క్రేన్లు ఏర్పాటు చేయాలనీ కోరారు. కార్యక్రమానికి ఆర్మూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ శైలజ, విధ్యుత్‌ డిఈ రమేశ్‌, బీమ్‌గల్‌ కమిషనర్‌, డివిజన్‌ స్థాయి పోలీసు అధికారులు, మర్కజ్‌ కమిటీ సభ్యులు, మండపాల సభ్యులు, అన్ని కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here