ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ

0
90

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో గల బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతీయువకులకు ఆర్‌ఆర్‌బీ, బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం నాలుగు నెలల పాటు ఉచిత ఫౌండేషన్‌ కోచింగ్‌ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న తెలిపారు.

జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల పాత బీఎస్‌ఎన్‌ఎల్‌ బిల్డింగ్‌లో బీసీ స్టడీ సర్కిల్‌లో ఈ ఉచిత శిక్షణ స్తామన్నారు. ఆసక్తిగల డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా వెబ్‌సైట్‌ http://studycircle.cgg.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పట్టణ అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకుమించరాదన్నారు. బీసీలకు 75 శాతం, ఎస్సీ లకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, అనాథలు, ఈబీసీలకు 5 శాతం రిజర్వేషన్‌ ఉంటుందన్నారు.
వివరాలకు ఫోన్‌ 08462-241055 లో సంప్రదించాలన్నారు.
లేదా
సుభాష్ నగర్ లోని నిర్మల హృదయ కాలేజీ కి ఎదురుగా, ఓల్డ్ BSNL బిల్డింగ్ రెండవ అంతస్థు లో గల బీసీ స్టడీ సర్కిల్ నందు సంప్రదించగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here