ఆర్‌టిసి కార్మికుల మానవహారం

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా ధర్నా చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా కాటిపల్లి రమణ రెడ్డి మాట్లాడుతూ నిజాం, హిట్లర్లను మించిన నియంత కెసిఆర్‌ అని, 50 వేల కుటుంబాలు రోడ్డున పడినా, డెడ్‌ లైన్లు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తూ హైకోర్టుకు దొంగ లెక్కలు చెప్తూ వస్తుందన్నారు. హై కోర్టు ఎన్ని సార్లు చర్చలు పెట్టమని చెప్తున్నా వినకుండా ఆర్‌టిసిని ప్రయివేటు పరం చేయడానికి చూస్తున్నాడని అన్నారు. ఐపిఎస్‌ అధికారులు కూడా కోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పడం విడ్డూరమని, వాళ్ళు దొరల పక్షాన కాకుండా ప్రజల పక్షాన నిలబడాలన్నారు. ఉద్యమాన్ని ఉదతం చేస్తే తొందరలోనే ప్రభుత్వం దిగి వచ్చి చర్చలకు వస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్‌టిసిని ప్రయివేటు పరం కానియ్యమని కార్మికుల పక్షాన బీజేపీ ముందునుండి నిలబడిందని అన్నారు. అనంతరం కార్మికులతో కలిసి 25 నిమిషాల పాటు బస్టాండు ఎదుట మానవ హారం నిర్వహించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here