ఆర్‌సెప్: స్వేచ్ఛా వాణిజ్యంలో భారత్, చైనా కలిసి సాగుతాయా?

0
1


ఆర్‌సెప్: స్వేచ్ఛా వాణిజ్యంలో భారత్, చైనా కలిసి సాగుతాయా?

డ్రాగన్ కంట్రీ.. చైనా మనకు పక్కలో బల్లెమే. మన శత్రుదేశమైన పాకిస్తాన్‌కి మిత్ర దేశం చైనా.. ఆ రకంగా చూస్తే.. చైనా కూడా మనకు శత్రుదేశమే. అయితే వాణిజ్య పరంగా చూసుకుంటే.. మనకంటే చైనాయే ఒక అడుగు ముందుంది. ఒకవైపు చైనా నుంచి చౌక రకం ఎలక్ట్రానిక్ తదితర వస్తువులు మన దేశంలోకి వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయినా సరే చైనాతో మన దేశానికి వర్తక లోటు అధికంగా ఉంది.

అసలే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగా ప్రపంచమే రెండుగా చీలిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. మరి మనదేమో నేటికీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ నేపథ్యంలో అటు చైనా నుంచి వచ్చిపడే ఉత్పత్తుల వల్ల దేశీయ తయారీ రంగం దెబ్బతినకుండా చూసుకోవాలి.. ఇటు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధాన్ని మన దేశానికి లాభదాయకంగా మలుచుకోవాలి.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకాక్‌లో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ (ఆర్‌సెప్)పై కీలక సమావేశం జరుగుతోంది. అంటే.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం అన్నమాట. ఎన్నో ఏళ్లుగా ‘ఆసియాన్’ సభ్య దేశాలు, ఇతర భాగస్వామ్య దేశాల మధ్య దీనిపై జరుగుతూ వస్తోన్న చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగే ఆయా దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో మన దేశం తరుపున వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ కూడా పాల్గొంటున్నారు.

మరి పరస్పరం శత్రువులుగా భావించుకునే భారత్, చైనాలు.. ఈ ‘ఆర్‌సెప్’పై ఒక అంగీకారానికి వస్తాయా? ఒకవేళ ఈ ఒప్పందం గనుక జరిగితే మన దేశానికి కలిగే మేలు ఏమిటి? నష్టం ఏమైనా జరుగుతుందా? ఒకవేళ అలాంటి పరిస్థితులే గనుక ఏర్పడితే.. జరిగే నష్టం నుంచి బయటపడటానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇవే మన దేశం ముందున్న పెద్ద సవాళ్లు.

అసలేమిటీ ఈ ‘ఆర్‌సెప్’?

ఆసియా ఖండంలోని కొన్ని దేశాల మధ్య చర్చల్లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఈ ‘ఆర్‌సెప్’. ఆర్‌సెప్ అంటే – రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్. తెలుగులో దీని అర్థం.. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం. 2012లో కంబోడియాలో జరిగిన ‘ఆసియాన్’ సదస్సులో ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక ఒప్పందం గురించిన చర్చలు మొదలయ్యాయి. గత ఏడేళ్లుగా దీనిపై ఆయా దేశాల నడుమ సంప్రదింపులు సాగుతున్నాయి. ఒకవేళ ఒప్పందం కుదిరి ఆసియాన్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు దీనిపై సంతకాలు చేస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ఒప్పందం అవుతుంది.

ఏయే దేశాలు ఉన్నాయంటే...

ఏయే దేశాలు ఉన్నాయంటే…

దీనిలో 10 సభ్య దేశాలు, మరో 6 భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. సభ్య దేశాలు – సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, లావోస్, బ్రూనై, కంబోడియా. భాగస్వామ్య దేశాలు – భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ప్రస్తుతం ‘ఆర్‌సెప్’కి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో కంబోడియాలో ఆయా దేశాల మంత్రుల సమావేశం జరిగింది. చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తదుపరి సమావేశం శుక్రవారం (నవంబర్ 1) నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఒకపక్క అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, మరొకపక్క వివిధ దేశాల రక్షణాత్మక చర్యల కారణంగా త్వరితగతిన ఈ ఒప్పందం కుదరాలని ఆర్‌సెప్‌లోని పలు దేశాలు భావిస్తున్నాయి.

‘ఆర్‌సెప్’తో స్వేచ్ఛా వాణిజ్యం...

‘ఆర్‌సెప్’తో స్వేచ్ఛా వాణిజ్యం…

సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు ఒక అంగీకారానికి వచ్చి ‘ఆర్‌సెప్’ కనుక విజయవంతం అయితే ఆయా దేశాల్లోని 350 కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛా వాణిజ్యం.. అంటే ఓపెన్ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా ‘ఆర్‌సెప్’ దేశాలు తమ దేశంలో తయారయ్యే ఉత్పత్తుల విక్రయాల కోసం సభ్య దేశాల మార్కెట్‌‌ల‌‌ను వాడుకుంటాయి. నిజానికి వాణిజ్య ఒప్పందాలు అనేవి ఇరుపక్షాలకూ ప్రయోజనకరంగా ఉండాలి. అయితే కొన్ని ఒప్పందాలు అలా ఉండడం లేదు. ‘ఆర్‌సెప్’లో భారత్, చైనాలే కీలకం. చైనా ఉత్పత్తులు యధేచ్ఛగా భారత్‌లోకి వచ్చిపడుతున్నా.. చైనా మార్కెట్‌లోకి భారత్ అంత సులభంగా వెళ్లలేకపోతోంది. అలాగే మిగిలిన దేశాలు కూడా. ఇవి అంత భారత్, చైనా మార్కెట్‌లలోకి సులువుగా ప్రవేశించలేకపోతున్నాయి.

భారత్ ఎదుట ఎన్నో సవాళ్లు...

భారత్ ఎదుట ఎన్నో సవాళ్లు…

వినియోగం విషయంలో మనం సూపర్.. కానీ వాణిజ్యం, ఎగుమతుల విషయానికొస్తే మనకన్నా చైనాయే బెటర్. మౌలిక వసతులు, ఎగుమతులు తక్కువగా ఉండడం, దిగుమతుల్లోనూ హెచ్చుతగ్గులు, కఠిన కార్మిక చట్టాలు, సంక్లిష్టమైన పన్ను వ్యవస్థ, అధికారస్వామ్యం, పైగా కరెన్సీ మారకంలో డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ బాగా తక్కువ ఉండడం.. ఇవీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టే కొన్ని అంశాలు. మన మార్కెట్‌లోకి చైనా ప్రవేశించినంత సులువుగా మనం చైనా మార్కెట్‌లోకి ప్రవేశించలేకపోతున్నాం. కారణం- చైనాలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గజిబిజిగా ఉంటోంది. అనుమతులు పొందడంతో తీవ్ర జాప్యం కారణంగా ఫార్మాతోపాటు ఇతర రంగాలకు సంబంధించి మనం చైనా మార్కెట్‌లోకి అడుగుపెట్టలేకపోతున్నాం. ఆ దేశం రక్షణాత్మక విధానాలు అవలంభించడం కూడా మరొక కారణం.

చైనా ఎక్కడ? భారత్ ఎక్కడ?

చైనా ఎక్కడ? భారత్ ఎక్కడ?

చైనాతో భారత్‌కు వాణిజ్య లోటు అధికంగా ఉంటోంది. ఆర్‌సెప్ దేశాలన్నింటితో కలిపి మన వాణిజ్య లోటు 105 బిలియన్ డాలర్లు అయితే, ఇందులో సగం వాణిజ్య లోటు ఒక్క చైనాతోనే ఉంటోంది. ఈ వాణిజ్య లోటు మరింత పెరిగితే మనకే నష్టం. దిగుమతులు మరింత అధికమై దేశంలోని తయారీ రంగం దెబ్బతింటుంది. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, లోహాలు, డైరీ పరిశ్రమ తదితర రంగాల్లో చైనా మనకంటే ఒక అడుగు ముందే ఉంటోంది. ఇప్పుడు ‘ఆర్‌సెప్’తో మాన మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకుంటే, వాణిజ్య సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయి స్వేచ్ఛా వాణిజ్యం అందుబాటులోకి వస్తే.. ‘ఆర్‌సెప్’ దేశాల నుంచి చౌక వస్తువుల దిగుమతులు మరింత పెరిగే అవకాశముంది. ఇలాంటి తరుణంలోనూ భారత్ తన వాణిజ్య హద్దులను కాపాడుకోగలగాలి.

 ‘ఆర్‌సెప్’‌తో మనకేంటీ ప్రయోజనం?

‘ఆర్‌సెప్’‌తో మనకేంటీ ప్రయోజనం?

మన దేశ జనాభా అధికం. దాంతోపాటు మనది అతిపెద్ద మార్కెట్ కూడా. అయితే మనది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. తయారీ రంగంలోని అధిక సామర్థ్యమే మన దేశ వాణిజ్య రంగానికి ఆధారం. అయినప్పటికీ ప్రపంచ తయారీ రంగంలో మన దేశ వాటా 2 శాతమే. ఈ వాటా 1 శాతం పెరిగినా మన దేశంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్‌సెప్’ మన దేశానికి ఎంతో కీలకం. స్వేచ్ఛాయుత వాణిజ్య విధానంలో డిజైనింగ్, నైపుణ్యం, సరఫరా సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుని మనం మన వాణిజ్య పరిధిని పెంచుకోవాలి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల లాభించే అవకాశాలను మనం అందిపుచ్చుకోగలగాలి. మరోవైపు దేశంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, ‘ఆర్‌సెప్’ దేశాలకు ఎగుమతులు పెంచగలగాలి. ఇదంతా జరగాలంటే.. ముందు చైనాతోపాటు మనం కూడా ‘ఆర్‌సెప్’పై ఒక అంగీకారానికి రావాలి. దీనికోసమే ఈ నెల 4న బ్యాంకాక్‌లో జరగబోయే ‘ఆర్‌సెప్’ నాయకుల సదస్సులో ప్రధాని మోడీ కూడా పాల్గొనబోతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here