ఆవిరి టీజర్: ఈ ఇంట్లో ఆత్మ ఉందట.. మీకు కనిపించిందా?

0
2


వెన్నులో వణుకు పుట్టించే దెయ్యం సినిమాలను తీయడంలో దర్శకుడు రవిబాబుది అందెవేసిన చెయ్యి. దెయ్యం సినిమాలనే కాదు క్రైమ్ థ్రిల్లర్‌లకు కూడా చాలా రసవత్తరంగా తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుడు. తాజాగా ఆయన తెరకెక్కించిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘ఆవిరి’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. ‘ఈ ఇంట్లో రాజ్‌కుమార్ రావు, అతని కుటుంబం నివసిస్తోంది. వారితో పాటు ఓ ఆత్మ కూడా ఉంది. దానిని మీరు కనిపెట్టగలరా?’ అన్న సబ్‌ టైటిల్స్‌తో టీజర్ మొదలైంది. ఓ డైనింగ్ టేబుల్‌ను తదేకంగా చూపిస్తూ ఒక్కసారిగా ఆ ఆత్మ కుర్చీ పక్కకు లాక్కుని జ్యూస్ గ్లాస్‌లో పోసుకుంటున్న సన్నివేశం దడ పుట్టించేలా ఉంది.

READ ALSO: సూర్య ‘బంగారు’ మనసు.. చిత్రబృందానికి అదిరిపోయే సర్‌ప్రైజ్

మనిషి కనిపించకుండా అతని బూట్లు మాత్రమే నడుస్తుండడం, ఓ బాత్‌టబ్‌ నుంచి పొగలు వస్తుండడం, అందులోని ఓ చెయ్యి బయటికి రావడం చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, రవిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కుక్కర్‌లో ఉడుకుతున్న మనిషి తలను ఫస్ట్‌లుక్‌లో చూపించినప్పుడే సినిమాలో ఏదో భయపెట్టే కంటెంట్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు రవి బాబు. ఇప్పుడు టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో రవిబాబు ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్తా, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకు కథ రాసింది కూడా రవిబాబే. ఆయన ఇతరుల చేత కథలే రాయించుకోవడం కంటే తన సొంత క్రియేటివిటీతో మంచి కథలు రాసుకుని వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. కొన్ని సార్లు ఆయన కాన్సెప్ట్‌లు బాక్సాఫీస్ వద్ద బెడిసికొడుతుంటాయి.

ఇందుకు ‘అదుగో’ సినిమానే ఉదాహరణ. ఓ పంది పిల్లను ప్రధాన పాత్రగా చూపిస్తూ తీసిన సినిమా ఇది. చిన్న పిల్లల కోసం మాత్రమే అన్నట్లుగా ఈ సినిమా తీయడంతో అది ఫ్లాపైంది. దాంతో ‘ఆవిరి’ సినిమాతో అయినా ‘అదుగో’ సినిమాతో నష్టపోయిన డబ్బును తిరిగి పొందాలని అనుకుంటున్నారు రవిబాబు. ఎందుకైనా మంచిదని ఈసారి నిర్మాత దిల్ రాజు సాయం తీసుకున్నారు. రవిబాబు క్రియేటివిటీపై నమ్మకం ఉంచిన దిల్ రాజు ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడానికి ఒప్పుకొన్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here