‘ఆసీస్‌ను ఓడించడానికి కేవలం ఆర్చర్‌పై ఆధారపడటం ఇష్టం లేదు’

0
0


లండన్‌: లార్డ్స్‌ మైదానంలో బుధవారం ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడానికి కేవలం పేసర్ జోఫ్రా ఆర్చర్‌పై ఆధారపడటం ఇష్టం లేదని ఇంగ్లాండ్‌ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ అభిప్రాయపడ్డారు. ఆర్చర్‌పై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదని కూడా కాలింగ్‌వుడ్ పేర్కొన్నారు. బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టార్ పేసర్, స్వింగ్ మాస్టర్ జేమ్స్ ఆండర్సన్ గాయం కారణంగా వైదొలగడంతో.. ఆర్చర్ రెండో టెస్టులో అరంగేట్రం చేయబోతున్నాడు.

‘రెండో టెస్టులో వార్నర్ చెలరేగుతాడు.. కళ్లలో ఆ కసి కనిపించింది’

ఈ సందర్భంగా కాలింగ్‌వుడ్ మాట్లాడుతూ… ‘అన్ని ప్రశ్నలకు సమాధానం ఆర్చర్ అవుతాడని నేను కచ్చితంగా చెప్పలేను. ఇప్పటికే మాకు మంచి బౌలింగ్ ఉంది. ఆర్చర్ తోడవడంతో మరింత బలం పెరిగింది. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ఆస్ట్రేలియాను ఓడించడానికి కేవలం ఆర్చర్‌పై ఆధారపడటం నాకు ఇష్టం లేదు’ అని కాలింగ్‌వుడ్ తెలిపారు. ‘ఆర్చర్ తన తొలి టెస్టులో ప్రభావం చూపుతాడు’ అని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ పేర్కొన్నారు.

తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌​ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా ఆర్చర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అనంతరం సెకండ్‌ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ససెక్స్‌ సౌత్‌ తరఫున ఆడి ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో పాటు అద్భుత సెంచరీ చేసాడు. అయితే గత 11 నెలల కాలంలో ఆర్చర్‌ కేవలం ఒక్క రెడ్‌బాల్‌ క్రికెట్‌ మాత్రమే ఆడాడు.

రగ్బీ జట్టు కోసం ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు ఏంచేశారంటే!!

రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పడతాం, జోఫ్రా ఆర్చర్‌ జట్టులోకి వచ్చినా ధీటుగానే బదులిస్తామని అంతకుముందు లాంగర్‌ హెచ్చరించాడు. లాంగర్ వ్యాఖ్యలను తాను తాను పెద్దగా పట్టించుకోనని ఆర్చర్ పేర్కొన్నాడు. తన టెస్టు అరంగేట్రంపై ఆర్చర్‌ మాట్లాడుతూ… ‘నేను వైట్‌బాల్‌ క్రికెట్‌ కంటే కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఎక్కువ ఆడా. దాంతో టెస్టు ఫార్మాట్‌ భయం లేదు. నేను రెడ్‌బాల్‌ ఎక్కువ ఆడాననే విషయం అభిమానులకు తెలియకపోవచ్చు. నేను ససెక్స్‌తో క్రికెట్‌ను ఆరంభించినప్పుడు ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే. మానసికంగా బలంగా లేనప్పుడు అసలు మనం ఎవరనే ప్రశ్న తలెత్తుంది. నేను టెస్టు ఫార్మాట్‌లో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ఆర్చర్ తెలిపాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఆస్ట్రేలియా 251 పరుగుల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూకుకెళ్లింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here