ఆసుపత్రికి నిప్పంటించిన దుండగుడు

0
0


ఆసుపత్రికి నిప్పంటించిన దుండగుడు

కాలి బూడిదైన సామగ్రి

ప్రమాదం జరిగిన ఆసుపత్రిలో విచారణ చేస్తున్న ఎస్‌హెచ్‌వో

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడిలో ఓ దుండగుడు ఓ దంత ఆసుపత్రికి నిప్పంటించాడు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. యాపిల్‌ దంత ఆసుపత్రిలోనికి చొరబడిన ఓ దుండగుడు కిరోసిన్‌ పోసి నిప్పటించి పరారయ్యాడు. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఆసుపత్రి సిబ్బంది తేరుకొని వాటిని అదుపు చేశారు. అప్పటికే మంచాలు, డెంటల్‌ కుర్చీలు, ఏసీలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న నిజామాబాద్‌ ఒకటో ఠాణా ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో నిప్పంటించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ దృశ్యాల ప్రకారం ఓ వ్యక్తి వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో సెక్యూరిటీ లేకపోగా, తాళాలు వేసి ఉండకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here