ఆసుపత్రిలో దొంగలు పడ్డారు

0
1


ఆసుపత్రిలో దొంగలు పడ్డారు

రక్షణ లేదంటూ వైద్యవిద్యార్థినుల ఆవేదన

పోలీసులకు ఫిర్యాదు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

చుట్టూ ప్రహరీ.. సుమారు 25 సీసీ కెమెరాలు.. 20 మంది రక్షణ సిబ్బంది ఉండగా... జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారు జామున దొంగలు పడి వైద్యవిద్యార్థుల(హౌజ్‌సర్జన్ల) నగలు, చరవాణి ఎత్తుకెళ్లారు. విషయం గమనించిన విద్యార్థినులు వారిని వెంబడించినా  ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి వెనక భాగంలో ఉన్న ప్రహరీ దూకి పారిపోయినట్లు సీసీ పుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై ఆగ్రహించిన వైద్యవిద్యార్థులు రక్షణ కల్పించాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఛాంబర్‌ వద్ద ఆందోళనకు దిగారు. చోరీ జరగడం ఇది నాలుగోసారి.. అయినా అధికారులు స్పందించడం లేదని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థినుల చెవి కమ్మలు, ముక్కుపోగు, చరవాణిని ఎత్తుకెళ్లారు. ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ఆకస్మిక తనిఖీలు లేక.. ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆకస్మిక తనిఖీలు చేసే అధికారులు లేకపోవడంతో ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు...? ఎప్పుడు వస్తున్నారో తెలియడం లేదు. విధుల్ల్లో ఉండాల్సిన వైద్యులు, సిబ్బంది, రక్షణ సిబ్బంది ఉంటున్నారా లేదా అని చూసే వారు లేకుండా పోయారు. రాత్రి సమయంలో వీరి పనితీరు మరింత అధ్వానంగా మారుతోంది.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here