ఆస్పత్రి నుంచే పోస్టు.. రెండోసారి సర్జరీ చేయించుకోవడం చాలా కష్టం

0
0


ఆమ్‌స్టర్‌డామ్‌: టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్ సురేశ్‌ రైనా మోకాలికి శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్న రైనా.. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో రెండోసారి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. దాంతో కనీసం నాలుగు నుంచి ఆరు వారాల పాటు రైనా క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. త్వరగా కోలుకోవాలని అండగా నిలిచిన వైద్యులు, సన్నిహితులు, అభిమానులకు రైనా ధన్యవాదాలు తెలిపాడు.

కోహ్లీ వినూత్న ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’.. మీరూ ఓ లుక్కేయండి!! (వీడియో)

మళ్లీ మోకాలి నొప్పి:

మళ్లీ మోకాలి నొప్పి:

శస్త్రచికిత్స నేపథ్యంలో రైనా తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ లేఖను పోస్ట్ చేసాడు. ‘2007లో నాకు ఈ సమస్య ప్రారంభమైంది. అప్పుడే తొలిసారి మోకాలి చికిత్స జరిగింది. తర్వాత కోలుకొని మైదానంలోకి వచ్చి 100% ఆటను ప్రదర్శించా. అప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన ట్రైనర్లు, వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత రెండు సంవత్సరాలుగా మళ్లీ మోకాలి నొప్పి ప్రారంభమైంది. అయితే నేను ఫిట్‌గా ఉండేందుకు మా సిబ్బంది ఎంతో ప్రయత్నించారు. వారి సహాయం వల్లే మైదానంలో చురుగ్గా ఆడగలిగాను’ అని రైనా తెలిపాడు.

సర్జరీ చేయించుకోవడం చాలా కష్టం:

‘ఇటీవల నొప్పి తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి శస్త్రచికిత్స తీసుకున్నా. రెండోసారి మోకాలికి సర్జరీ చేయించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే.. మైదానంలో అడుగుపెట్టడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. అయినా చికిత్స తీసుకునేందుకు సిద్ధపడ్డా. త్వరలోనే కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెడతా. తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్న సన్నిహితులు, అభిమానులకు ధన్యవాదాలు’ అని రైనా పేర్కొన్నాడు.

అభిమానులకు శుభవార్త.. రెండో వన్డేకు వరణుడి ముప్పు లేనట్టే!!

పేలవ ఫామ్:

పేలవ ఫామ్:

భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌‌లో తరచుగా మ్యాచ్‌లు ఆడుతున్న రైనా.. ఈ ఏడాది ఐపీఎల్-12 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తాచాటాడు. మూడు హాఫ్‌ సెంచరీలతో మెరిశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here