ఆహార భద్రత చట్టం అమలయ్యేలా చూడాలి

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలకు ఆరోగ్యకరమైన, ఆకలి తీర్చే పౌష్టిక ఆహారాన్ని అందించడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ చైర్మన్‌ కె. తిర్మల్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు కమిషన్‌ పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో కమిషన్‌ సభ్యులతో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆహార భద్రతకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అంగన్‌వాడి కేంద్రాలలో మహిళలకు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కొత్తగా రేషన్‌ కార్డులకై దరఖాస్తు చేసుకున్నారు. ప్రజలకు జారీ చేసిన కార్డుల విషయాలు, రేషన్‌ సరుకుల సరఫరా, ఇబ్బందులు తదితర విషయాలపై సంబంధిత శాఖల అధికారులు రేషన్‌ డీలర్లు, మండల విద్యాశాఖ అధికారులు, తహసీల్దార్లు తదితర అధికారులతో సుదీర్ఘంగా మూడున్నర గంటలకు పైగా లోతుగా సమీక్షించడంతో పాటు మంగళవారం ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, నిజామాబాద్‌ మండలాల్లో వారి పర్యటన సందర్భంగా తెలుసుకున్న లోటుపాట్లను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ రేషన్‌ కార్డు దరఖాస్తు చేసుకున్న అందరికీ కార్డులు అందించి వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు సక్రమంగా సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. పేద ప్రజలకు ఆహారానికి సంబంధించిన బియ్యం ఇతర వస్తువులు అందించడం చట్టం కల్పించిన హక్కు అని అధికారులు, ఉద్యోగులు రేషన్‌ డీలర్లు ఈ విషయంలో ఖచ్చితంగా లబ్ధిదారులకు అన్యాయం చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని ఆయన స్పష్టం చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here