ఆ అంఫైర్ పోర్న్ స్టార్ అని తేలియడంతో అవాక్కైన ఇంగ్లాండ్ క్రికెటర్లు!

0
0


హైదరాబాద్: నవంబర్ 5న నెల్సన్‌ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 కోసం ప్రకటించిన అంపైర్ల జట్టులో ఒకడైన గార్త్‌ స్టిరాట్‌ మాజీ పోర్న్ స్టార్. 51 ఏళ్ల గార్త్‌ స్టిరాట్‌ ఫోర్త్ అంఫైర్‌గా వ్వవహారించిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

బ్రిటిష్ టాబ్లాయిడ్ ద సన్ ప్రచురించిన వార్త కథనం ప్రకారం అతడి చిత్రాలు ఓ మ్యాగజైన్‌లో కూడా ప్రచురితమయ్యాయి. స్టీవ్‌ పార్నెల్‌ పేరిట పలు నీలి చిత్రాల్లో నటించాడు. అతనొక పోర్న్‌స్టార్‌ అన్న విషయం న్యూజిలాండ్‌ క్రికెటర్లకు తెలుసు. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్‌ ప్లేయర్లకు కివీస్ క్రికెటర్లు చెప్పడం విశేషం.

D/N Test: తొలిరోజు ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట కొట్టేదెవెరో తెలుసా?

పదేళ్ల క్రితం న్యూజిలాండ్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా గార్త్ స్టిరాట్‌ పని చేశాడు. ఆ సమయంలోనే అతడు పోర్న్‌ స్టార్‌గా పలు నీలి చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ఈ విషయం బహిర్గతం కావడంతో న్యూజిలాండ్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ పదవికి రాజీనామా చేశాడు.

ఆ తర్వాత క్రికెట్‌ అంపైర్‌గా అవతారం ఎత్తాడు. క్రికెట్ అంఫైర్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. గతంలో పలు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్టిరాట్‌ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరిస్ జరుగుతుంది.

అరుదైన ఘనతకు వికెట్ దూరంలో చాహల్: ఆఖరి టీ20లో అందుకుంటాడా?

శుక్రవారం నేపియర్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లాండ్‌ 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలింతగా ఇరు జట్ల మధ్య ఇప్పటికే నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగ్గా చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఐదో టీ20 ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ విజేతగా నిలుస్తుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here