ఆ చాయ్‌వాలాకు సలాం.. టీ అమ్మే వ్యక్తికి వీవీఎస్ లక్ష్మణ్ ఫిదా, ఎందుకంటే..

0
1


గొప్పవాడు.. పేదవాడికి సాయం చేయడం మెచ్చుకోదగిన విషయమే. కానీ, పేదవాడు.. తన స్వార్థాన్ని పక్కన పెట్టి, తోటి పేదవారికి సాయం చేయడమంటే, అది అంతకంటే గొప్ప విషయం కదూ. కాన్పూర్‌కు చెందిన ఓ చాయ్‌వాలా కూడా అదే చేస్తున్నాడు. తన స్వార్థాన్ని మరిచి.. పేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాడు. అతడి సేవకు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఫిదా అయ్యారు.

Also Read: చికెన్‌ ముక్కకు ప్రాణం వచ్చింది, ప్లేటు నుంచి పరిగెట్టింది!

ఈ సందర్భంగా లక్ష్మణ్ తన ట్విట్టర్ పేజీలో ఆ చాయ్‌వాలా సేవలను ప్రశంసిస్తూ పోస్టు చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘కాన్పూర్‌కు చెందిన మహమ్మద్ మహబూబ్ మాలిక్ అనే వ్యక్తి టీ అమ్ముతూ 40 మంది పిల్లలను చదివిస్తున్నాడు. చిన్న టీస్టాల్ ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం వారి చదువులకే కేటాయిస్తున్న అతడు అందరికీ స్ఫూర్తిదాయకం’’ అని ట్వీట్ చేశారు.

Also Read: అతడే దేవుడు.. రైలు కిందపడబోయిన వ్యక్తిని సెకన్ల వ్యవధిలో కాపాడాడు, వీడియో వైరల్!

ఈ ట్వీట్‌ను ఇప్పటివరకు 25వేల మంది లైక్ చేశారు. ఆ చాయ్‌వాలా చేస్తున్న సేవకు నెటిజనులు సైతం ఫిదా అవుతున్నారు. అతడి సేవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని కొనియాడుతున్నారు. అతడు చేస్తున్న దానిలో కొంతైనా మనం చేయగలిగితే చాలు అని అంటున్నారు. స్ఫూర్తిదాయకమైన ట్వీట్ చేసినందుకు లక్ష్మణ్‌ను సైతం ప్రసంశిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here