ఆ పోర్న్ వీడియోలతో వచ్చిన ఆదాయం అంతంతే.. మియా ఖలీఫా వెల్లడి

0
0


పోర్న్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తులు కోట్లాది రూపాయలు సంపాదిస్తారని అంతా భావిస్తారు. అయితే, ఇంటర్నెట్‌లో అత్యధిక రసికులు సెర్చ్ చేసే పోర్న్ స్టార్ మియా ఖలీఫా సంపాదన ఎంతో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మన టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుకు లభించే ఆదాయంలో సగం కూడా ఆమె సంపాదించకపోవడం గమనార్హం.

మియా ఖలీఫా ఐదేళ్ల కిందటే పార్న్ ఇండస్ట్రీని వదిలేసింది. అయితే, ఇప్పటికీ ఆమె నటించిన పోర్న్ వీడియోలు ఇంటర్నె్ట్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆమెతో పోర్న్ సినిమాలు చేసిన నిర్మాతలు చేతి నిండా సంపాదిస్తున్నారు. అయితే, మియా ఖాలీఫాకు మాత్రం ఆ వీడియోల వల్ల ఒక్క పైసా కూడా రావడం లేదట. ఎప్పుడైతే తాను పోర్న్ ఇండస్ట్రీ వదిలేసిందో అప్పుడే ఆదాయం కూడా ఆగిపోయిందని తెలిపింది.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘నేను పోర్న్ ఇండస్ట్రీలో బాగా సంపాదించననేది పూర్తిగా అవాస్తవం. ఆ వీడియోలు చేస్తున్నప్పుడు నేను సంపాదించిన మొత్తం 12,000 డాలర్లు మాత్రమే. ఆ తర్వాత నేను ఒక్క పైసా కూడా సంపాదించలేదు. పోర్న్ వీడియోలు చేయడం మానేసిన తర్వాత సాధారణ ఉద్యోగం వెతుక్కోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది’’ అని తెలిపింది.

‘‘నేను చేసిన పోర్న్ వీడియోలు చాలా తక్కువ. కానీ, ఆ వీడియోలు కార్చిచ్చులా వ్యాపించాయి. ఇప్పటికీ అవి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు నేను ఇంకా పోర్న్ సినిమాల్లో నటిస్తున్నాననే అనుకుంటున్నారు’’ అని మియా తెలిపింది. మియా ఖాలీఫా చేసినవి తక్కువ వీడియోలే. కానీ, ఆమె ముస్లింల పవిత్ర వస్త్రం హిజాబ్ ధరించి పోర్న్ వీడియో పాల్గోవడం వివాదస్పదమైంది. ఆమెకు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అంతేగాక, వారు ఆమె ఇన్‌స్టా్గ్రామ్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here