ఆ రక్తపాతంతోనే ఉగ్రవాదం.. కశ్మీర్‌పై పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

0
3


క్యరాజ్య సమితి వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై మరోసారి విషం కక్కారు. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించి ప్రజలను బంధీలను చేశారని ఆరోపించారు. అక్కడ కర్ఫ్యూ ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని హెచ్చరించారు. శుక్రవారం (సెప్టెంబర్ 27) ఐరాస సర్వసభ్య సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడిన ఇమ్రాన్.. భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. పాక్ స్వభావానికి విరుద్ధంగా అగ్రరాజ్యం అమెరికా పైనా ఆరోపణలు చేశారు.

‘అణ్వస్త్రాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం వస్తే అది రెండు దేశాలకే పరిమితం కాదన్నారు. సరిహద్దులు దాటుతుంది. అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. తన కంటే ఏడింతలు పెద్దదైన ఓ దేశంతో పోరాడటానికి ఏ దేశమైనా ఆలోచిస్తుంది. కానీ, భారత్‌తో యుద్ధమంటూ వస్తే పాక్ చూస్తూ ఊరుకోదు. చివరి వరకు పోరాడతాం’ అని ఇమ్రాన్ అన్నారు. ఇమ్రాన్ వ్యాఖ్యలకు పాక్‌కు మద్దతిచ్చే దేశాల ప్రతినిధులు చప్పట్ల ద్వారా హర్షం ప్రకటించారు.

ఆరెస్సెస్ విద్వేషమే మహాత్మా గాంధీని చంపేసింది
‘నరేంద్ర మోదీ ఆరెస్సెస్‌ నుంచి వచ్చిన వారు. ముస్లింలు, క్రిస్టియన్లంటే ఆరెస్సెస్‌కి విద్వేషం. వారి మాటల్లోనే అది వ్యక్తమవుతుంది. గూగుల్‌లో వెతికితే అలాంటి విద్వేషపూరిత ఘట్టాలు అనేకం కనిపిస్తాయి. ఆరెస్సెస్ జాత్యాంహకార, విద్వేషపూరిత సిద్ధాంతమే మహాత్మా గాంధీని చంపేసింది’ అని ఇమ్రాన్ అన్నారు.

Must Read: విద్యార్థినుల ఫోటోలు తీసి పోర్న్ సైట్లలో.. పాతబస్తీ యువతి దారుణం

కశ్మీర్‌ ప్రజలను 55 రోజులుగా బంధించారని.. ఒక్కసారి కర్ఫ్యూని ఎత్తివేస్తే జరిగేది రక్తపాతమేనని పాక్ ప్రధాని చెప్పారు. 9 లక్షల మంది సైనికులను సరిహద్దులో ఉంచితే తాము 500 మందిని ఎందుకు పంపిస్తామని ఆయన ప్రపంచ అధినేతలను ప్రశ్నించారు. ‘మరో దాడి జరిగితే భారత్‌ మళ్లీ నిందించేది మమ్మల్నే. ఇన్నాళ్లు మీరు బంధించాక కర్ఫ్యూను ఎత్తివేస్తే అక్కడి యువత తుపాకీ పట్టక మరేం చేస్తుంది’ అని ఇమ్రాన్ ప్రశ్నించారు.

రెండు అణ్వస్త్ర దేశాలు పోరాడితే ఆ యుద్ధం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాబోదని ఇమ్రాన్ అన్నారు. యుద్ధం రాకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిదేనని కోరారు. 1945లో ఇలాంటి కారణంతోనే ఆ సంస్థ ఆవిర్భవించిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: ఎస్‌ఐనే చంపబోయారు.. దుండిగల్‌లో దొంగల బీభత్సం

‘కశ్మీర్‌లో ఉగ్రవాదం గురించి మోదీ మాట్లాడారు. బలూచిస్థాన్‌లో భారత గూఢచర్యం గురించి నేను చెప్పాను. పుల్వామా దాడి తర్వాత ఆధారాలు చూపాలని అడిగా. ఇవన్నీ పక్కనపెట్టి చర్చలు జరుపుదామంటే మోదీ నుంచి స్పందన రాలేదు’ అని మోదీ చెప్పారు. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే తాను ఐక్యరాజ్య సమితి సమావేశానికి వచ్చానని స్పష్టం చేశారు.

ఆ అంశాన్ని ఎన్నికల్లో మోదీ బాగా వాడుకున్నారు..
‘సర్జికల్‌ స్ట్రయిక్‌లో 300 మందిని చంపామని మోదీ చెప్పారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని బాగా వాడుకున్నారు. కానీ, అక్కడ కొన్ని చెట్లు మాత్రమే కూలిపోయాయి. వాటిని మేం పెంచుతున్నాం. ఇదంతా ట్రైలరే అని ఎన్నికల సమయంలో మోదీ చెప్పారు. ఎన్నికల తర్వాత భారత్‌లోని పరిస్థితి మారుతుందని ఆశించా. కానీ, అందుకు భిన్నంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. 80 లక్షల మంది ప్రజలను కర్ఫ్యూలో ఉంచారు’ అంటూ ఇమ్రాన్ విషం కక్కారు.

‘ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్‌ ఫోబియా పెరుగుతోంది. 9/‌11 దాడుల తర్వాత ఇది మరింత పెరిగింది. కొందరు నేతలు ఉగ్రవాదాన్ని ముస్లిం మతంతో ముడిపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ముస్లింలను అతివాదులుగా ముద్రవేశాయి. ముస్లింలను ఆత్మాహుతి దళ సభ్యులుగా చిత్రీకరిస్తున్నారు. మతానికి టెర్రరిజానికి సంబంధం లేదు’ అని ఇమ్రాన్ అన్నారు.

నాడు తమిళ హిందువులే ఆత్మాహుతి దాడులు చేసేవారు..
సెప్టెంబర్‌ 11 దాడులకు ముందు ఆత్మాహుతి దాడులు చేసేవారు తమిళ హిందువులేనంటూ ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు హిందువులపై ఎవరూ ఉగ్రవాదులుగా ముద్ర వేయలేదన్నారు. సెప్టెంబర్‌ 11 దాడుల్లో పాక్ ప్రమేయం లేకపోయినా 70 వేల మంది పాకిస్థానీయులు చనిపోయారు అని ఇమ్రాన్‌ చెప్పుకొచ్చారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here