ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు.. జట్టులోనే కొనసాగుతున్నా: గేల్

0
0


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. ఇంకా జట్టులోనే కొనసాగుతున్నా అని ‘యూనివర్స్‌ బాస్‌’ వెస్టిండీస్ ఓపెనర్‌ క్రిస్‌ గేల్ స్పష్టం చేసాడు. టీమిండియాతో జరిగిన మూడో వన్డేనే తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అంటూ వార్తలు రావడంతో గేల్‌ పైవిధంగా స్పందించాడు. తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదని, ప్రస్తుతం వస్తున్న వార్తలు అన్ని రూమర్లేనని గేల్‌ వివరణ ఇచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు ‘యూనివర్స్‌ బాస్‌’ క్రిస్‌ గేల్ గుడ్‌బై?

రిటైర్మెంట్‌ వాయిదా:

రిటైర్మెంట్‌ వాయిదా:

మెగా టోర్నీ ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని క్రిస్‌ గేల్ ఓ సందర్భంలో తెలిపాడు. ప్రపంచకప్‌లో విండీస్ ఆశించినంత ఆడలేక లీగ్ దశ నుండే నిష్క్రమించింది. అయితే గేల్ తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రపంచకప్‌ జరుగుతుండగానే.. బహుశా టీమిండియాతో సిరీసే తన చివరిదని గేల్‌ చెప్పుకొచ్చాడు. దీంతో గేల్ రిటైర్మెంట్‌ వాయిదా పడింది.

హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి:

హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి:

భారత్‌తో వన్డే సిరీస్‌ అనంతరం గేల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని సిరీస్ ఆరంభం నుంచే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన వన్డేలో గేల్‌ తనదైన రీతిలో చెలరేగాడు. సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకపడ్డాడు. 41 బంతుల్లో 72 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతడు ఔటైన తర్వాత భారత ఆటగాళ్లంతా అతణ్ని అభినందించడం, మైదానాన్ని వీడుతూ గేల్ హెల్మెట్లో బ్యాట్‌ను పెట్టి పైకెత్తి అభిమానులకు అభివాదం చేయడం లాంటివి గేల్‌కు ఇదే ఆఖరి మ్యాచ్‌ అని సంకేతాలు ఇచ్చాయి.

కోహ్లీకి, భారత అభిమానులకు క్షమాపణలు చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్

ఎటువంటి ప్రకటనా చేయలేదు:

టీమిండియాతో జరిగిన మూడో వన్డేనే గేల్‌కు చివరిది అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. అందరూ రిటైర్మెంట్‌ అంటూ వార్తలు కూడా ప్రచారం చేశారు. దీనిపై గేల్ స్పందించాడు. ‘ప్రస్తుతం రిటైర్మెంట్‌ గురించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇంకా నేను విండీస్ జట్టులోనే కొనసాగుతున్నా’ అని స్పష్టం చేసాడు. దీంతో గేల్ ఎప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడో అని మళ్లీ చర్చలు మొదలయ్యాయి.

మెరుపు ఇన్నింగ్స్‌:

మెరుపు ఇన్నింగ్స్‌:

గేల్ చివరగా తనదైన శైలిలో ఓ మెరుపు ఇన్నింగ్స్‌ (41 బంతుల్లో 72, 8 ఫోర్లు, 5సిక్స్‌లు) తో నిష్క్రమించాడు. భువనేశ్వర్ తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ముగించిన గేల్.. అనంతరం ఫ్రీ హిట్‌ను సిక్స్‌గా మలిచి పరుగుల ఖాతా తెరిచాడు. అక్కడి నుండి గేల్‌ భారత బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వర్షం కురిపించాడు. అతని దెబ్బకు స్కోరు బోర్డును పరుగులు పెట్టింది. గేల్ సునామీతో విండీస్ 12 ఓవర్లకు 121 పరుగులు చేసింది. తొలి 16 బంతుల్లో 10 పరుగులే చేసిన గేల్.. 31 బంతుల్లో 56 పరుగులు చేసాడు.

రికార్డులు:

రికార్డులు:

విండీస్ తరఫున ఎక్కువ వన్డేలు ఆడిన బ్యాట్స్‌మెన్ (301)గా, వన్డేల్లో ఎక్కువ పరుగులు (10,480) సాధించిన రికార్డులు గేల్‌పైనే ఉన్నాయి . అంతర్జాతీయ టీ20లో మొదటి సెంచరీ (2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై), అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (105) బాదిన రెండో బ్యాట్స్‌మన్, టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన నలుగురిలో ఒక్కడు, ఇక వన్డేల్లో డబుల్ సెంచరీలు రికార్డులు కూడా ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here