ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్: యాషెస్‌లో తొలిరోజే ఇంగ్లీషు ఫ్యాన్స్ ఎగతాళి

0
2


హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి పునరాగమనం చేసిన తర్వాత కామెరూన్ బాన్‌క్రాప్ట్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు తొలి టెస్టు మ్యాచ్‌ని ఆడుతున్నారు. అయితే, వీరికి ఇంగ్లాండ్‌ అభిమానుల నుంచి చేదు అనుభవం తప్పలేదు. ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం ఎడ్జిబాస్టన్ వేదికగా ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాతీయగీతం ఆలపిస్తుండగా కొంతమంది ఇంగ్లాండ్‌ అభిమానులు ట్యాంపరింగ్‌కు ఉపయోగించే సాండ్‌పేపర్‌ను చూపిస్తూ హేళన చేశారు. ఓ అభిమాని అయితే బాల్ టాంపరింగ్ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే విధంగా బ్యానర్‌తో దర్శనమిచ్చాడు.

ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం.. అతనిలా మ్యాచ్‌లు ముగించాలనుకుంటున్నా

ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్

ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్

ఆ బ్యానర్‌పై “ఇంగ్లాండ్ ఛాంప్స్, ఆసీస్ చీట్స్” అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్‌తో కూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు కొన్ని వేదికల్లో ఇలాంటి నిరసనలే వ్యక్తం కాగా.. యాషెస్‌ సిరిస్‌లో సైతం మళ్లీ ఇలాంటి ఘటనలే ఎదురుకావడం గమనార్హం.

యాషెస్ అంటేనే భావోద్వేగాలు

అయినప్పటికీ అవేమీ మనసులో పెట్టుకోకుండా స్మిత్, వార్నర్ తామెంటో నిరూపించారు. డేవిడ్ వార్నర్ అయితే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇక, యాషెస్ సిరిస్ అంటేనే భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. ఆటగాళ్లు ఎలా ఉన్నా అభిమానులకు మాత్రం ఇదొక యుద్ధమే.

కవ్విస్తోన్న ఇంగ్లీషు అభిమానులు

కవ్విస్తోన్న ఇంగ్లీషు అభిమానులు

అలాంటి యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను ఇంగ్లీషు అభిమానులు ఎగతాళి చేయకుండా ఉంటారనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. అయితే యాషెస్ ప్రారంభమైన తొలి రోజే అభిమానులు ఈ విధంగా ఆస్ట్రేలియాకు షాకిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.

లంచ్ విరామానికి ఆస్ట్రేలియా 83/3

గతేడాది సఫారీ గడ్డపై బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా… కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇక, ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుుతన్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఎదురీదుతోంది. 27 ఓవర్లు ముగిసే సరికి లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(23), ట్రావిస్ హెడ్(26) పరుగులతో ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here