ఇంజినీరింగ్‌ విద్యపై సమగ్ర అవగాహనకు సదస్సు

0
0


ఇంజినీరింగ్‌ విద్యపై సమగ్ర అవగాహనకు సదస్సు

ఈనాడు – కె.ఎల్‌. డీమ్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహణ

నిజామాబాద్‌:  ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రస్తుతం అనేక సందేహాలు ఉంటున్నాయి. ఇంజినీరింగ్‌లో చేరితే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటి కళాశాలను, కోర్సులను ఎంచుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి అవకాశాలు అందుకునేందుకు వీలుంటుంది… తదితర అనేక ప్రశ్నలు  ఇంటర్మీడియట్‌ తరువాత ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ నైపుణ్యం లేని జీవితం ఊహించుకోవడమే కష్టం. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విద్యకు డిమాండ్‌ ఉండటం సహజమే. అయితే.. కళాశాల ఎంపిక దగ్గర నుంచి కోర్సుల వరకూ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ  కోర్సు చదవాలి? ఎటువంటి విద్యా సంస్థలో చేరాలి? వాటిలో ఎటువంటి వసతులు, మౌలిక సదుపాయాలుండాలి? విద్యావిధానం ఎలా ఉంటే విద్యార్థుల ఉన్నతికి ఉపయోగపడుతుంది? కళాశాల విద్యకు విశ్వవిద్యాలయం హోదా పొందిన విద్యా సంస్థలకు తేడా ఏమిటి? ప్రమాణాలు ఎలా ఉంటాయి? వాటిని గుర్తించడం ఎలా? దేశాభివృద్ధిలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల కీలకపాత్ర? ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగమా.. ఉన్నత విద్యా మార్గమా.. ఏది ఎంచుకోవాలి, ఏది ఎంచుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కావాలా? పరిశోధన అంటే ఏమిటి? పరిశోధనల కారణంగా విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగాలు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో సమాధానాలు, విశ్లేషణాత్మకంగా, సమగ్రంగా తెలియజేయాలనే లక్ష్యంతో ‘కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటి – ఈనాడు’ సంయుక్తంగా ఇంజినీరింగ్‌ విద్యలో ‘దశ-దిశ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేఎల్‌ డీమ్డ్‌ యూనివర్సిటీకి చెందిన అనుభవజ్ఞులైన, నిపుణులైన ఆచార్యులు, డైరెక్టర్లు పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారు.

వివరాలకు: 8008615550
అవగాహన సదస్సు జరిగే వేదిక ఇదే:
రాజీవ్‌గాంధీ ఆడిటోరియం,
ఖలీల్‌వాడి, నిజామాబాద్‌
తేది: 09-11-2019 సమయం: 09.00 నుండి 1.00 వరకు
గమనిక: సదస్సులో పాల్గొనే విద్యార్థుల్లో కొందరికి లక్కీ డీప్‌ ద్వారా బహుమతులు ఇస్తారు. పాల్గొనే ప్రతి విద్యార్థికి కె.ఎల్‌. డీమ్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఒక కిట్‌ కూడా ఉచితంగా ఇస్తారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here