ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌

0
0నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో ఆవిష్కరణల సంస్కతికి ప్రోత్సాహం ఇవ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ఇన్నోవేషన్‌ ఎగ్జిబిషన్‌ను ఆగష్టు 15 వ తేదీన ప్రారంబిస్తున్నారు. ఆసక్తి గల వారు తమ తమ సొంత జిల్లాల్లో వారి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది ఒక చక్కటి అవకాశం. తెలంగాణ ప్రభుత్వం నెలరోజుల క్రితం ప్రారంభించిన కార్యక్రమానికి మొత్తం 500 దరఖాస్తులు వచ్చాయి. అందులో 360 ప్రదర్శనకు అర్హత సాధించడం జరిగింది. అలాగే 220 షార్ట్‌ లిస్ట్‌ చేయడం జరిగింది. గ్రామీణ స్థాయి ఆవిష్కరణల నుండి సాంకేతిక స్థాయి వరకు అన్ని విభాగాలకు చెందిన ఆవిష్కరణలు ఇందులో చోటు చేసుకున్నాయి. ఆరు ఆవిష్కరణలు స్టార్ట్‌ అప్‌లుగా ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఐటిఇ అండ్‌ సి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆవిష్కరణల సమాహారం స్వాతంత్య్ర దినోత్సవానికి సరికొత్త శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, యువకులు, వద్దులు, రైతులు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికను పంచుకోనున్నట్లు తెలిపారు. పౌరులంతా పెద్ద సంఖ్యలో ఎగ్జిబిషన్‌ లను సందర్శించి ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here