ఇంటింటా లార్వా నిల్వలే

0
3


ఇంటింటా లార్వా నిల్వలే


ఆశా కార్యకర్తలకు సూచనలిస్తున్న జిల్లా మలేరియా అధికారి

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఏకకాలంలో చేపట్టిన ఏడీిస్‌ సర్వేలో ఇంటింటా లార్వా నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవల ఆజాంగంజ్‌లో ఒక వ్యక్తి డెంగీతో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా పాలనాధికారి ఎంఆర్‌ఎం రావు నియంత్రణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పట్టణంలో సోమవారం ఆ శాఖ బోధన్‌ డివిజన్‌లోని సిబ్బందిని మోహరించారు. ఎనిమిది మండలాల్లోని ఆరు పీహెచ్‌సీల పరిధిలోని 280 మంది ఆశా కార్యకర్తలు, 80 మంది ఏఎన్‌ఎంలను, వీరికి అదనంగా పర్యవేక్షకులను నియమించారు. ఒక్కొక్కరికి 50-60 ఇళ్లు కేటాయించారు. బల్దియా పరిధిలోని 16,200 నివాసాల్లో దాదాపుగా 70 శాతం సర్వే చేపట్టారు. మురుగు వాడల్లో ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడి నివాసాల్లోకి వెళ్లిన సిబ్బంది విస్మయం చెందాల్సి వచ్చింది. ప్రతి ఇంట్లోనూ ఏదో రకమైన సాధనాల్లో ఏడీిస్‌ దోమ లార్వా నిల్వలు దర్శనమిచ్చాయి. కూలర్లు, టైర్లలోనే ఈ సమస్య నెలకొంది. స్వయంగా సిబ్బందే నీటిని తొలగించి లార్వాను నిర్వీర్యం చేశారు. మరీ ఎక్కువ ఉన్న చోట దోమల నివారణకు రసాయనాలు వదిలారు. బహిరంగ ప్రదేశాల్లో నీటి నిల్వల్లో చమురు బంతులు విసిరారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం తప్పనిసరని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ పేర్కొన్నారు. సిబ్బంది ప్రతిసారి వచ్చి తొలగించలేరని పేర్కొన్నారు. ఆయన వెంట ఉప వైద్యాధికారి డాక్టర్‌ విద్య, కమిషనర్‌ స్వామినాయక్‌, తదితరులు ఉన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here