ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్

0
0


ఇంటిని దోచెయ్యడానికి 16ఏళ్లుగా ఎదురుచూసిన ఇల్లాలు..!అదను చూసి భర్త పిల్లల్ని కాదని నగదు నగలుతో జంప్

అమరావతి/హైదరాబాద్ : పదహారేళ్లుగా కొనసాగిన వారి వైవాహిక బంధం పది తులాల బంగారంతో తునాతునకలైంది. పెళ్లి చేసుకున్న పదమారేళ్లుగా భర్తను ఎప్పుడు మోసం చేసి ఇంటిని దోచేద్దామా అని ఎదురుచూసిన సదరు ఉత్తమ ఇల్లాలు ఎట్లకేలకు వన్ ఫైన్ ఈవినింగ్ బీర్వాలోని డబ్బులను, బంగారాన్ని మూటకట్టుకున్ని తుర్రున ఉడాయించింది. అంతే కాదు పదహారేళ్ల వారి కాపురానికి ఫలితంగా పుట్టిన ఇద్దరు సంతానాన్ని కూడా కాదనుకుని కేవలం డబ్బు నగలుతో పరారయ్యింది ఆ ఇల్లాలు.

ఇంతకూ అదనుకోసం పదహారు ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఇల్లాలు కథ కమామిషు ఏంటో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 16ఏళ్లకు ఏ భార్య అయిన ఇలా చేస్తుందని ఊహించరు. ఇక ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన పారుపల్లి నాగేశ్వరరావుకు అదే జిల్లాకు చెందిన తునికి చెందిన లావణ్యతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె సంతానం కలిగారు.

దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇంటి డబ్బు, నగలు ఇతర వ్యవహారాలు కూడా లావణ్యనే చూసుకునేది. నాగేశ్వరరావు డబ్బు, బంగారు నగలను బెడ్రూమ్‌లోని బీరువాలో దాచి తాళాలు లావణ్యకే ఇచ్చేవాడు. ఈ నెల 8వ తేదీన పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చిన అతడు బీరువా తెరిచి చూడగా 53వేల రూపాయల నగదు, 10 తులాల బంగారం కనిపించలేదు. దీంతో కంగారుపడి లావణ్యను పిలిచాడు. ఓ వైపు భర్త పిలుస్తుండగానే లావణ్య బ్యాగులు తీసుకుని స్పీడుగా బయటకు వెళ్లిపోయింది.

దీన్ని గమనించిన నాగేశ్వరరావు బయటకు వెళ్లి చూడగా లావణ్య కనిపించలేదు. అనుమానమొచ్చి బీరువాలో ఉన్న మిగిలిన నగలను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో భార్య తనను మోసం చేసి డబ్బు, బంగారంతో ఉడాయించిందని తెలుసుకుని తెల్లమొహం వేసుకుంటూ తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16ఏళ్లు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కలిగిన తర్వాత లావణ్య తనను ఇంతలా మోసం చేయడాన్ని బాధితుడు తట్టుకోలేకపోతున్నాడు. పెళ్ళైన 16ఏళ్లకు భార్య ఇలా చేయడంతో కొందరికి ఈ విషయం హాస్యాన్ని కూడా పంచిపెట్టింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here