ఇంటి నిర్మాణానికి.. ఆన్‌లైన్‌లో అనుమతులు ఇలా!

0
0


ఇంటి నిర్మాణానికి.. ఆన్‌లైన్‌లో అనుమతులు ఇలా!

సొంత ఇల్లు అనేది చాలామందికి ఒక కలగానే మిగిలిపోతోంది. కొంతమంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారు. అయితే ఇల్లు కట్టుకోవాలని అనుకోగానే ఎదురయ్యే మొదటి సవాలు – ఆ ఇంటికి అవసరమైన అనుమతులు తెచ్చుకోవటం. ఇక్కడే చాలామంది వెనకడుగు వేస్తుంటారు.

మన డబ్బుతో, మన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా.. ఏవేవో అనుమతులు తీసుకొచ్చుకోవాలి. దీనికీ కొంత ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు డబ్బులు పెట్టినా.. ఏవేవో కొర్రీలు. దీంతో ఈ బాధ పడలేక చాలా మంది ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో దళారులను ఆశ్రయిస్తారు.

అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతు కోసం ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం.. సులభంగా ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టిం (డీపీఎంఎస్‌)ను తీసుకొచ్చింది.

తొలుత హెచ్ఎండీఏ పరిధిలో, ఆపైన…

ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనుమతులను ఆన్‌లైన్‌లోనే ఇచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే ప్రారంభించింది. తొలుత దీనిని హెచ్ఎండీఏ పరిధిలో అమలు చేశారు. అక్కడ ఈ విధానం విజయవంతం కావడంతో ఆ తరువాత దానిని జీహెచ్ఎంసీ పరిధిలోనూ అమలు చేశారు. అక్కడ కూడా మంచి ఫలితాలు రావడంతో.. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అమలు చేస్తున్నారు.

అన్నీ సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే...

అన్నీ సక్రమంగా ఉంటే నెలరోజుల్లోనే…

దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు భవన నిర్మాణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్‌ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నిర్మాణానికి ఆన్‌లైన్‌లో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. లైసెన్సు కలిగిన ఆర్కిటెక్ట్ నుంచి అవసరమైన ప్లాన్‌ను పొంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే వారికి నెల రోజుల వ్యవధిలోపే సంబంధిత అనుమతులన్నీ ఇవ్వాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అవసరమైన పత్రాలన్నింటినీ అప్‌లోడ్‌ చేసిన వారికి 15 రోజుల్లోనే ఇంటి నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఏయే పత్రాలు ఉండాలంటే...

ఏయే పత్రాలు ఉండాలంటే…

భవన నిర్మాణ అనుమతి దరఖాస్తు, (ఈ పత్రంలో స్థల యజమాని, ఆర్కిటెక్ట్‌, ఇంజనీర్‌ సంతకం చేసి ఉండాలి), దరఖాస్తు ఫీజు, భవనం నిర్మించాలని భావిస్తోన్న స్థలం ఫోటో, పహాణీ, సదరు స్థలానికి సంబంధించిన సేల్‌ డీడ్‌ జిరాక్స్ కాపీ, (గెజిటెడ్‌ అధికారి సంతకం చేసి ఉండాలి), లింక్‌ డాక్యుమెంట్‌ జిరాక్స్ కాపీ ( గెజిటెడ్‌ అధికారి సంతకం చేసి ఉండాలి), లే-అవుట్‌ కాపీ, స్థలం తాజా మార్కెట్‌ విలువను సూచించే పత్రం, ఎన్‌కంబరెన్స్‌ పత్రం(ఈసీ), ల్యాండ్‌ యూసేజ్ సర్టిఫికెట్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌, గూగుల్‌ లోకేషన్‌ పింగ్‌, గుర్తింపు పత్రం, రూ.100 విలువ కలిగిన స్టాంప్‌ పేపర్‌పై ఆఫిడవిట్‌ (నోటరీ), డిక్లరేషన్‌ రూ.20ల విలువ కలిగిన స్టాంప్‌ పేపర్‌పై (నోటరీ).. ఇవన్నీ ఉండాలి.

ఇంటి ప్లాన్‌ ఎలా ఉండాలంటే..

ఇంటి ప్లాన్‌ ఎలా ఉండాలంటే..

కొత్తగా నిర్మాణం చేపట్టే భవనానికి సంబంధించిన ప్లాన్‌ ఆటో క్యాడ్‌ డ్రాయింగ్‌ ప్రీడీసీఆర్‌ ఫార్మాట్‌లో ఉండాలి. లోకేషన్‌ ప్లాన్‌, కాంటూర్‌ ప్లాన్‌, సైట్‌ ప్లాన్‌తో పాటు భవనంలోని ప్రతి అంతస్తుకు సంబంధించి సమగ్రమైన డ్రాయింగ్స్‌ ఉండాలి. అలాగే పార్కింగ్‌ ఫ్లోర్స్‌, టెర్రస్‌, బిల్డింగ్‌ ఎలివేషన్‌, క్రాస్‌ సెక్షన్‌, ల్యాంగిట్యూడనల్‌ సెక్షన్‌, రెయిన్‌ వాటర్‌ హర్వెస్టింగ్‌ పిట్‌, యజమాని, ఆర్కిటెక్ట్‌, స్ట్రక్చరల్ ఇంజనీర్ల సంతకాలతో కూడిన మార్టిగేజ్‌ ప్లాన్‌ కూడా ఉండాలి. అలాగే భవన నిర్మాణం అనుమతికి సంబంధించిన దరఖాస్తు వెంట 1 :5000 స్కేలు తగ్గని ప్లాను జత చేయాలి. భవన నిర్మాణ స్థలానికి చేరటానికి ప్రస్తుతం ఉన్న దారి వివరాలు కూడా ప్లానులో పొందుపరచాలి. స్థలం హద్దుల కొలతలు, ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న భవనాల వివరాలు, భవన నిర్మాణ స్థలానికి ఇరుగు, పొరుగున ఉన్న వీధుల వివరాలు.. అన్నీ ప్లాన్‌లో క్లియర్‌గా ఉండాలి.

స్థలం 500 గజాల పైన ఉంటే...

స్థలం 500 గజాల పైన ఉంటే…

ఒకవేళ భవన నిర్మాణ స్థలం 500 గజాలు, ఆపైన ఉంటే.. అలాంటి నిర్మాణాల (స్కూలు భవనాలు, ఫంక్షన్‌ హాల్స్‌, ప్రజా అవసరాలకు వినియోగించే ఇతర భవనాలు)కు తప్పనిసరిగా ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్’ (నిరభ్యంతర పత్రం) జత చేయాల్సి ఉంటుంది. అలాగే భవన నిర్మాణానికి సంబంధించి ఒక ప్లాన్‌.. సంబంధిత అగ్ని మాపక శాఖకి కూడా దరఖాస్తుదారు సమర్పించాల్సి. ఎందుకంటే, ప్రతిపాదిత భవనం ఎత్తు 6 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ భవనానికి అగ్నిమాపక శాఖ నిబంధనలు వర్తిస్తాయి. భవనాల ఎత్తును బట్టి ఈ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎక్కడంటే...

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎక్కడంటే…

ఇల్లు లేదా భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల కోసం ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ కింది వెబ్‌సైట్లు చూడాలి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివాసం ఉంటున్న వారు

http://dpms.ghmc.telangana.gov.in అనే లింక్‌పైన క్లిక్ చేయాలి. అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న వారు

https://dpms.hmda.gov.in లింక్‌ ఓపెన్ చేసి చూడాలి. ఇక ఈ రెండు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో నివసిస్తున్న వారు భవన నిర్మాణం కోసం

http://dpms.dtcp.telangana.gov.in అనే లింక్‌పై క్లిక్ చేసి అందులో కోరిన వివరాలు పొందుపరచాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here