ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని లాక్కెళ్లి తొక్కి చంపిన ఏనుగు!

0
5


దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారిని ఓ ఏనుగు పొట్టన పెట్టుకుంది. ఇంటి గోడ పగలగొట్టి, తొండంతో చిన్నారిని బయటకు లాక్కెళ్లిన ఏనుగు.. ఆమెను కిందపడేసి తొక్కి చంపింది. ఒడిశాలోని చంపువా అటవీ ప్రాంతంలోని ముందాశీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె అన్న, చెల్లి తీవ్రంగా గాయపడ్డారు.

అర్ధరాత్రి గ్రామంలోకి చొరబడిన ఏనుగు ఇంటిపై దాడి చేసి గోడను పగలగొట్టింది. అనంతరం ఇంట్లో నిద్రపోతున్న సిని ముండాను తొండంతో పట్టుకుని పగిలిన గోడ నుంచి బయటకు లాక్కెళ్లింది. ఆ తర్వాత ఆమెను కిందపడేసి తొక్కి చంపేసింది. పగిలిన గోడ చిన్నారులపై పడటంతో గాయపడ్డారని, దీంతో వెంటనే అక్కడి నుంచి కదల్లేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన సిని అన్న గణేష్, చెల్లి రాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here