ఇండియన్ మార్కెట్ లోకి దూసుకొచ్చిన డుకాటీ డయావెల్‌ 1260 బైక్..! భారత రోడ్లకు సరిపోతాయా..?

0
0


ఇండియన్ మార్కెట్ లోకి దూసుకొచ్చిన డుకాటీ డయావెల్‌ 1260 బైక్..! భారత రోడ్లకు సరిపోతాయా..?

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ద్విచక్ర వాహన తయారీల్లో పేరొందిన కంపెనీలు పోటీ పడుతున్నయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మోటారు బైకులను రూపొందిస్తున్నారు కంపెని యజమానులు. ముఖ్యంగా యువత అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ద్విచక్ర వాహనాలకు రూపకల్పన జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ ఇటాలియన్ సూపర్‌ బైక్స్‌ తయారీ కంపెని సరికొత్త హంగులతో దాదాపు 1300సీసీ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.

ద్విచక్ర వాహనాల్లోనే రారాజు ఐనటువంటి హార్లీ డేవిడ్సన్ బైకులను తలదన్నే మోడల్ ను మార్కెట్ లోక ప్రవేశ పెట్టినట్టు మోటార్ రంగంలో చర్చ జరుగుతోంది. డుకాటీ డయావెల్ 1260 పేరుతో ఈ బైకును విడుదల చేసారు. అంతర్టాతీయ రోడ్లపై రివ్వున దూసుకెళ్లే బైకులు భారతీయ రోడ్లపై ఎంతవరకు దూసుకెళ్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మార్కెట్లో విడుదలవుతున్న కొత్త కొత్త బైకులపై కన్నేసి ఉంచే బారత దేశ యువతను ఈ డుకాటీ డయావెల్ 1260 సూపర్ బైక్ ఎంత వరకు సంతృప్తి పరుస్తుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

ఇటాలియన్‌ సూపర్‌ బైక్స్‌ తయారీ దిగ్గజం డుకాటీ.. భారత మార్కెట్లోకి సరికొత్త ‘డయావెల్‌ 1260’ బైక్‌ను శుక్రవారం ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ ధర 17.7 లక్షల రూపాయలు కాగా, ఇదే మోడల్‌లో అధునాతన స్పోర్ట్స్‌ బైక్‌ను కంపెనీ విడుదలచేసింది. ‘డయావెల్‌ 1260 ఎస్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చిన నూతన స్పోర్ట్స్‌ వేరియంట్‌ ధరను 19.25 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఇందులో 1262 సీసీ ఇంజిన్‌ను అమర్చించి.

ఈ సందర్భంగా డుకాటీ ఇండియా ఎండీ సెర్గీ కెనోవాస్‌ మాట్లాడుతూ.. ‘క్రూయిజర్‌ను ఇష్టపడే వాళ్లలో అధిక శాతం వినియోగదారులు డయావెల్‌ మోడల్‌ను ఇష్టపడతారు. నూతన 1260 బైక్‌కు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాం’ అని అన్నారు. ఇంతటి సామర్థ్యం గల ద్విచక్ర వాహనం ధర ఎక్కువైనప్పటికి భారత రోడ్లపై ఎంత వేగంతో దూసుకెళ్తుందో చూడాలి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here