ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక..!

0
1


ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక..!

జకార్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.9గా నమోదైంది. సుమిత్రా దీవుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలను తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు భూకంప ప్రభావంతో ప్రాణ నష్టమేమి సంభవించలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సుమత్రా దీవుల సమీపంలో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బాంటెన్ తీరం, జావా తీర ప్రాంత ప్రజలు వెంటనే తరలించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. సునామీ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేషియాలో రాత్రి 7 గంటలకు భూకంపం వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. భూకంపం కేంద్రం జావాలోని 52.8 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపిందని వివరించారు. మరోవైపు పండెల్ గ్లాంగ్ తీరం ప్రాంతంలోని మూడు మీటర్ల నివాస సముదాయం వరకు సునామీ ప్రభావం ఉంటుందని ఇండోనేషియా అధికారులు తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here